న్యూ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 20,438 కి పైగా కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. చైనాలో 400 మందికి పైగా మరణాలు సంభవించాయి. చైనాలో అత్యంత ప్రభావితమైన వుహాన్ ప్రాంతం నుండి పౌరులను తరలించడానికి భారతదేశం అనేక ఇతర దేశాలు కార్యకలాపాలు చేపట్టాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కిట్లను కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపించింది. దీంతో, ప్రతిరోజు 30 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మంది కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చేరగా, నగరంలోని ఫీవర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రిలో వారిని ప్రత్యేక సదుపాయాల మధ్య వైద్యుల పరిశీలనలో ఉంచారన్నారు. వారి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. కాగా, వారిలో 11 మందికి కరోనా వైరస్‌ లేదని నమూనా పరీక్షలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. మరో 8 మంది వివరాలు వెల్లడించాల్సి ఉందనీ.. ల్యాబ్‌ నుంచి నమూనాల ఫలితాలు రాగానే వారి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు.


చైనాలో చిన్న జ్వరంగా మానవ శరీరంలోకి ప్రవేశించిన ఈ వైరస్‌ ప్రాణాలను రోజు వ్యవధిలో హరిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి బారిన పడి 304 మంది చనిపోయారు. ఇంకా వేల మంది ఈ వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. చైనాలోని వుహాన్‌ నగరంలో ఉంటున్న భారతీయులు ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రత్యేక సైనిక వైద్య శిబిరాల్లో ఉన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..