ముంబై: కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్‌డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 160 మంది మృత్యువాత పడ్డారంటే అక్కడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. మహారాష్ట్ర సర్కార్ మంగళవారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం నమోదైన 121 కేసులను పరిగణనలోకి తీసుకోకుండానే గత 24 గంటల్లోనే రాష్ట్రంలో కొత్తగా 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 11 మంది మృతి చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : India Coronavirus Positive Cases: దేశంలో 10వేలు దాటిన కరోనా కేసులు


మహారాష్ట్రలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే.. రాజధాని ముంబైలోనే కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ముంబైలో ఇప్పటివరకు 1540 మంది కరోనాబారినపడగా.. 101 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా వైరస్ వ్యాధి నయమైన వారి సంఖ్య కూడా ఒక రకంగా అధికంగానే ఉంది. ఇప్పటివరకు కరోనా సోకి నయమైన వారి సంఖ్య 229గా ఉంది. 


Also read : లాక్‌డౌన్‌లో 19,952 RPF పోస్టులు భర్తీ చేస్తున్నారా!


భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 10,363 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 8988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాధి నయమై, డిశ్చార్జ్ అయిన వారు, వలసవెళ్లిపోయిన వారు కలిపి 1035 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. కరోనావైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 339గా ఉంది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే.. దేశంలో ఐదో వంతు కంటే కొంత అధిక సంఖ్యలోనే మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉండటం ఆ రాష్ట్ర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..