పాట్నా: కరోనావైరస్‌తో (Coronavirus) బాధపడుతూ మరో 38 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. బీహార్‌లోని ముంగర్‌కి చెందిన వ్యక్తి కరోనావైరస్ సోకిన అనంతరం చికిత్స కోసం పాట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో (Patna AIIMS) చేరారు. ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. దీంతో భారత్‌లో కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య (COVID-19 death toll in India) 6కు చేరుకోగా.. బీహార్‌లో ఇదే తొలి కరోనా వైరస్‌ పాజిటివ్ వ్యక్తి మృతి కేసుగా నమోదైంది. రెండు రోజుల క్రితమే అతడు కోల్‌కతా నుంచి తిరిగొచ్చాడని పాట్నాలోని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇదిలావుంటే... శనివారమే ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో బాధపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ముంబైలో కరోనావైరస్ పాజిటివ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందడంతో భారత్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకోగా.. పాట్నాలో మృతి చెందిన 38 ఏళ్ల యువకుడితో కలిపి ఆరుకు చేరింది. అలా ఒకేరోజు ఇద్దరు మృతి చెందిన వైనం కరోనా తీవ్రరూపం దాలుస్తోందనే సంకేతాలను ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : విజయవాడ, రాజమండ్రిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు


ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ICMR) వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత్‌లో కరోనావైరస్‌ సోకిన వారి సంఖ్య 341కి చేరుకుంది. మార్చి 22వ తేదీ వరకు 16,999 రక్త నమూనాలను పరిశీలించినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..