Delhi records second highest COVID-19 fatalities: న్యూఢిల్లీ‌: దేశ రాజ‌ధాని ఢిల్లీ ( Delhi ) లో క‌రోనావైర‌స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. బుధవారం రికార్డు స్థాయిలో కరోనాతో 133 మంది మరణించగా.. ఒకరోజు తర్వాత శుక్రవారం మరణాల సంఖ్య మళ్లీ వంద మార్క్ దాటింది. తాజాగా దేశ రాజధానిలో 118 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా బాధితులు వంద మందికి పైగా మరణించడం ఇది (highest covid-19 deaths ) రెండోసారని ప్ర‌భుత్వం వెల్లడించింది. అయితే శుక్రవారం 62,425 కరోనా పరీక్షలు చేయగా.. 6,608 పాజిటివ్ కేసులు ( COVID-19 cases) న‌మోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Uttar Pradesh: కల్తీ మద్యం తాగి నలుగురు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాలతో.. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 5,17,238 కి పెరగగా.. మరణాల సంఖ్య 8,159 కి చేరింది. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,68,143 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,936 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 90.50 శాతం ఉండగా, మరణాల రేటు 1.58 శాతంగా ఉంది. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి