Covaxin: తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ చిక్కుల్లో పడింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల వాలంటీర్ మృతి చెందడంతో..అత్యవసర వినియోగపు అనుమతిపై ప్రశ్నలు రేగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారతదేశ తొలి స్వదేశీ వ్యాక్సిన్..హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech Company ) అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ ( Covaxin ) కు డీసీజీఐ ( DCGI ) అత్యవసర వినియోగపు అనుమతి మంజూరు చేసింది. మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే అనుమతి ఇవ్వడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కోవ్యాగ్జిన్ తీసుకున్న వాలంటీర్ మరణించడంతో విమర్శల ధాటి పెరిగింది.


భోపాల్ ( Bhopal ) లోని పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ లో డిసెంబర్ 12వ తేదీన కోవ్యాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ ( Phase 3 human trials ) లో భాగంగా గిరిజన కూలీ 42 ఏళ్ల దీపక్ మర్వాయికి వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న 9 రోజులకు అంటే డిసెంబర్ 21న మృతి చెందాడు. కోవ్యాగ్జిన్ ( Covaxin ) తీసుకుని ఇంటికి తిరిగొచ్చిన తరువాత దీపక్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఛాతీ నొప్పితో బాధపడ్డాడని..ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 21వ తేదీన ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడని కుటుంబసభ్యులు చెప్పారు. 


Also read: Balakot airstrikes: ఆ దాడుల్లో 3 వందలమంది మరణించారని ధృవీకరణ


అయితే మధ్యప్రదేశ్ ( Madhya pradesh ) మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాత్రం దీపక్ మర్వాయికు విషప్రయోగం జరిగినట్టు అనుమానాలున్నాయన్నారు.  అటు ఈ వ్యవహారంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది. ఫేజ్-3 ట్రయల్స్‌లో భాగంగా అతడి అంగీకారంతోనే వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నఏడు రోజుల వరకూ ఎలాంటి అనారోగ్య లక్షణాలు, దుష్ప్రభావాలు కన్పించలేదని..ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. 9 రోజుల తరువాత మరణించాడంటే..వ్యాక్సిన్ కారణం కాదని కంపెనీ చెబుతోంది. 


మూడో దశ ప్రయోగాల డేటా పూర్తిగా రాకుండానే అత్యవసర వినియోగపు అనుమతి ఇచ్చినందుకు ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి చెందడం కలకలం రేపుతోంది.


Also read: Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం