Covaxinupdates: 'WHO approves Bharat Biotech's Covaxin for emergency use' : హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ద‌క్కింది. దీంతో భార‌త్ లో మాత్ర‌మే కాకుండా ఇత‌ర దేశాల్లోనూ కొవాగ్జిన్ టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ల‌భించింది. కొవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్ అన్ని విధాలుగా ప‌రీక్షించిన‌ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ.. ఏ లోపాలు లేక‌పోవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం కోసం భారత్ బయోటెక్ (Bharat Biotech) ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను అత్యవసర జాబితాలో చేర్చాలని భారత్ బయోటెక్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసుకుంది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (Emergency Use Listing) కోసం ఈవోఐ (ఎక్ప్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్) సమర్పించింది. ఈ క్రమంలోనే జూలై 6న వ్యాక్సిన్ డేటా (Vaccine data) రోలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టుగా డబ్ల్యూహెచ్‌వో (WHO) వెల్లడించింది.


Also Read : Diwali Offers: అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో ముగుస్తున్న దీపావళి ప్రత్యేక ఆఫర్లు


ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెందిన టెక్నిక‌ల్ అడ్వ‌యిజ‌రీ క‌మిటీ (Technical Advisory Committee) కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చే విష‌య‌మై గ‌తంలోనే అక్టోబ‌ర్ 26న‌ స‌మావేశ‌మైంది. ఆ స‌మావేశంలో టీకాకు సంబంధించి భార‌త్ బ‌యోటెక్ ఇచ్చిన స‌మాచారాన్ని ప‌రిశీలించి అదనపు సమాచారం కావాలని కోరింది. భార‌త్ బ‌యోటెక్ (Bharat Biotech) సంబంధిత సమాచారం అంద‌జేయ‌డంతో తాజాగా మ‌రోసారి భేటీ అయ్యింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ జాబితా కోసం తుది “రిస్క్-బెనిఫిట్ అసెస్‌మెంట్” (Risk-Benefit Assessment) నిర్వహించింది డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం. టీకా త‌యారీదారు ఇచ్చిన స‌మాచారంతో సంతృప్తి చెంది ఆమోదం తెలిపింది. 


ఈ గుర్తింపు వల్ల ఈ వ్యాక్సిన్‌ను (Vaccine‌) ప్రపంచ దేశాలకు అందించే వీలు కలుగుతుంది. అలానే ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఇక్కడి పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఆంక్షలు గానీ, స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం ఉండదు.


Also Read : Ram Charan: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్


ఇప్పటికే భారత్‌లో కొవాగ్జిన్‌ (Covaxin) టీకాను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. రెండు డోసుల్లో తీసుకునే ఈ వ్యాక్సిన్‌తో కరోనాతో పాటు పలు వేరియంట్ల నుంచి రక్షణ సురక్షితంగా ఉండొచ్చు.అలాగే కొవాగ్జిన్‌ టీకా నిల్వ గడువు (Shelf-life) కూడా 12 నెలలకు పెరిగింది. కొవాగ్జిన్‌ టీకా వినియోగ గడువును సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO) పెంచింది. వాక్సిన్‌ తయారీ తేదీ నుంచి ఏడాది పాటు వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) కంపెనీ తాజాగా ప్రకటించింది. కంపెనీ వ్యాక్సిన్‌ వినియోగ గడువును 24 నెలలకు పొడగించాలని కోరుతూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (Drug Controller General of India) లేఖ రాసింది. ఈ మేరకు సంస్థ కొవాగ్జిన్‌ (Covaxin) టీకాకు సంబంధించిన డేటాను డ్రగ్‌ రెగ్యులేటర్‌కు సమర్పించినట్లు పేర్కొంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి