Diwali Offers: రూ. 21,999 శాంసంగ్​ గెలాక్సీ ఎం31 ఫోన్ కేవలం రూ.13,999కే.. త్వరపడండి

Diwali Offers: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లు దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో తెచ్చాయి. స్మార్ట్​ఫోన్లు, టీవీలపై ఉంచిన ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 06:21 PM IST
  • దీపావళి నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాల భారీ ఆఫర్లు
  • శాంసంగ్ ఫోన్లపై అమెజాన్ అదిరే డిస్కౌంట్లు
  • యాపిల్ ఫోన్లు, టీవీలపై ఫ్లిప్​కార్ట్​ భారీ తగ్గింపు
Diwali Offers: రూ. 21,999 శాంసంగ్​ గెలాక్సీ ఎం31 ఫోన్ కేవలం రూ.13,999కే.. త్వరపడండి

Amazon, Flipkart offers: దిపావళి నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ఫ్లిప్​కార్ట్​లు భారీ ఆఫర్లలతో సేల్ నిర్వహిస్తున్నాయి. రేపే దీపావళి పండుగ అయినందున ఆఫర్లు దాదాపు ముగింపు దశకు చేసుకున్నాయి. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ఆఫర్లు ఇవే..

అమెజాన్ ముఖ్యంగా స్మార్ట్​ఫోన్లపై భారీ ఆఫర్లను (Amazon Discount sale) ఇస్తోంది. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు ముగిశాయి. ప్రస్తుతం సాధరణ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్​ గెలాక్సీ (Offers on Samsung mobiles) ఎం31పై రూ.5 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​తో కూడిన గెలాక్సీ ఎం 31 వాస్తవ ధర రూ. 21,999గా ఉంది. ఆపర్లో దీనిని రూ.15,999కే పొందే వీలుంది. హెచ్ఎస్​బీసీ, ఆర్​బీఎల్, ఫెడరల్ బ్యాంక్​ల కార్డ్​ల ద్వారా ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్​ బ్యాంక్ లభిస్తుంది. 

దీనితో పాటు.. ఎక్స్ఛేంజ్ ద్వారా అయితే మరో రూ.15,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే ఇది ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండీషన్​పై ఆధారపడి ఉంటుంది.

ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే ప్రైమ్​ యూజర్లకు ఆరు నెలల వరకు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్​ ఆఫర్ వర్తిస్తుంది.

Also read: Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్

Also read: Facebook face-recognition tool: ఫేస్​బుక్ సంచలన నిర్ణయం- త్వరలో ఆ ఫీచర్​ మాయం!

శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్​పై కూడా భారీ తగ్గింపు ఇస్తోంది అమెజాన్​. దీని వాస్తవిక ధర రూ.14,499 కాగా.. ఆఫర్లో దీనిని రూ.11,999కే పొందే వీలుంది. ఈఫోన్​పై రూ.11,250 వరకు ఎక్సేంజ్​ ఆఫర్​ కూడా అందుబాటులో ఉంది. ఆఫర్ల ద్వారా రూ.10 వేల లోపు మంచి ఫోన్​ కావాలనుకుంటే.. ఎం21 ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు. 8జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​తో ఈ ఫోన్ లభిస్తుంది.

ఫోన్లతో పాటు.. స్మార్ట్ టీవీలు, దీపావళికి సంబంధించిన వస్తువులపై కూడా అమెజాన్ ఆఫర్లను ఉంచింది. ఇవన్ని పరిమితకాల ఆఫర్లు కావడం గమనార్హం.

Also read: Gold Price Today: బంగారం ప్రియులకు దంతేరాస్ పండుగ వేళ గుడ్‌న్యూస్, బంగారం ధర ఎంతంటే

Also read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌.. త్వరపడండి!

ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు..

ఫ్లిప్​కార్ట్​ కూడా దిపావళి పండుగ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను (Flipkart Diwali offers) ప్రకటించింది. ఈ ఆఫర్లకు తోడు ఎస్​బీఐ డెబిట్​, క్రడిట్​ కార్డులను ఉపయోగించి కొనుగోళ్లు జరిపితే తక్షణం పది శాతం డిస్కౌంట్ (Flipkart Discount offers) లభించనుంది. ఎస్​బీఐ యోనో యాప్​పై కూడా ఈ ఆఫర్​ అందుబాటులో ఉండనుంది.

స్పెషల్ ఆఫర్లు ఇలా..

ఐఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది.  ఐఫోన్ 12 మిని (64 జీబీ) ధరను రూ.42,099కి (offers on Apple iPhones) తగ్గించింది. ఫ్లిప్​కార్ట్ పోర్టల్​లో ఉన్న సమచారం ప్రకారం.. అన్ని ఆఫర్లను కలిపి రూ.39,994కే ఈ ఫోన్​ను సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్​కింద రూ.15000 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే ఇది ఎక్స్ఛేంజ్ ఇచ్చే ఫోన్ కండీషన్​పై ఆధారపడి ఉంటుంది.

దీనితో పాటు.. ఇతర కంపెనీల ఫోన్లపైనా ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్లు ఇస్తోంది. 

స్మార్ట్​ టీవీలపై ఆఫర్లను పరిశీలిస్తే.. ఫ్లిప్​కార్ట్ పడ్జెట్ టీవీలపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్​ ఇస్తోంది. 32 అంగుళాల రియల్​మీ నియో టీవీ ధరను రూ.11,999కి తగ్గించింది ఫ్లిప్​కార్ట్​. బ్యాంక్​ ఆఫర్​, ఇతర అన్ని కూపన్లను ఉపయోగిస్తే.. రూ.10,799కే దీనిని సొంతం చేసుకునే వీలుంది. దీనిపై కూడా రూ.11 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు నేటి అర్ధ రాత్రితో (Flipkart Diwali offers last date) ముగియినున్నాయి. అయితే ఆ తర్వాత సాధారణంగా రోజువారీగా అందించే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.

Also read: JioPhone Next: జియోఫోన్ నెక్ట్స్​ గురించి బిగ్ అప్​డేట్​- ధర, ఫీచర్ల వివరాలు వెల్లడి

Also read: Flipkart: ఇక ఫ్లిప్‌కార్ట్‌లో వ్యవసాయ ఉత్పత్తులు, రైతులతో ఒప్పందాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News