Covid 19 Cases Updates in India: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందనే చెప్పవచ్చు. కొంత కాలంగా కరోనా కేసులు ఐదు వేలకు తక్కువగా నమోదవటమే ఒక ఉదాహరణ. థర్డ్ వేవ్ తరువాత భారీగా కేసులు తగ్గటం అందరికి ఆనందాన్ని కలిగించే విషయమే. పాజిటివ్ కేసుల నమోదుతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,503 కరోనా కేసులు నమోదవగా.. మహమ్మారి కారణంగా మొత్తం 27 మంది ప్రాణాలు వదిలారు. దేశయంలో రోజు వారి పాజిటివిటీ రేటు 0.47 శాతం ఉండగా.. ప్రస్తుతం 36,168 యాక్టివ్ కేసులున్నాయి. 


కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5,15,877 మంది ప్రాణాలు మహామ్మారి కారణంగా ప్రాణాలు కోల్పయారు. గడిచిన 24 గంటల్లో 4,377 మంది కరోనా భారీ నుండి కోలుకోగా.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,24,41,449 చేరింది. 


 



కరోనా కేసులు తగ్గినప్పటికీ.. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ మాత్రం త్వరగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 180.19 కరోనా టీకా డోసులు పంపిణీ చేయగా దేశంలో రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 5,32,232 టెస్ట్ లు నిర్వహించగా.. 2,503 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 77.90 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 


Also Read: Telangana Jobs: తెలంగాణలో మొదలు కానున్న ఉద్యోగాల జాతర, పోలీస్ శాఖ నుంచే ప్రారంభం


Also Read: Rishabh Pant: కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook