India Covid 19 Cases Update: భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు!!
భారత దేశంలో సోమవారం 1,67,059 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ముందు రోజులతో పోల్చుకుంటే.. దాదాపు 40 వేల వరకు కొవిడ్ కేసులు తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1192 మంది మృత్యువాత పడ్డారు.
India Covid 19 Cases Update: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. భారత దేశంలో కూడా కరోనా వ్యాప్తి విజృభిస్తోంది. మూడో దశలో రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే దేశంలో సోమవారం కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే.. దాదాపు 40 వేల వరకు కొవిడ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఈ వార్త దేశ ప్రజలకు ఉపశమనం కలిగించేదే.
సోమవారం కరోనా కొత్త కేసులు తగ్గినా.. మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 1192 మంది వైరస్ బారిన పడి మరణించారు. గత రోజుతో పోల్చుకుంటే 250 అధికం. ఈ రెండేళ్లలో 5 లక్షలకు పైగా మంది కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పొయారు. సోమవారం 2,54,076 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,43,059 లక్షల ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
భారత దేశంలో ఆదివారంతో పోలిచ్చుకుంటే సోమవారం కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది. 15.77 శాతం నుంచి 11.69% శాతానికి పాజివిటీ రేట్ తగ్గింది. ఆక్టివ్ కేసుల రేటు 4.20 శాతం పెరిగింది. దేశంలో శుక్రవారం నాటికీ 1,66,68,48,204 వాక్సినేషన్ పూర్తయింది. అయితే పలు రాష్ట్రలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడం సంతోషించాల్సిన విషయం.
Also Raed: Union Budget 2022 Live: నేడు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2022..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook