Here is List of Demands from Telangana in Budget 2022: దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు ఆశగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ఎంతో ప్రాధాన్యత సంచరించుకుంది. 2022 బడ్జెట్‌లో తమకు ఊరట కల్పిస్తారని ఆయా రంగాలతో పాటు దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈసారి బడ్జెట్ రాజకీయంగా చాలా ప్రత్యేకం అనే చెప్పాలి.
దేశంలో మరో కొద్దిరోజుల్లో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కేంద్రం కచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఉత్తర భారత దేశంలో ఎన్నికల నేపధ్యంలో దక్షిణాదిలోని కీలక రాష్ట్రాలు కూడా పలు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచనున్నాయి. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు కూడా తమ డిమాండ్లను కేంద్రం ముందు ఉంచాయి. ఆ డిమాండ్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
తెలంగాణ:
తెలంగాణలోని ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ 2022లో రూ. 8,000 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కేపీహెచ్‌బీ-కొక్కపేట్-నార్సింగి కారిడార్‌లో ప్రతిపాదిత మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ లేదా ఎమ్‌ఆర్‌టీఎస్ కోసం 450 కోట్లు కేటాయింపులు ఇందులో ఉన్నాయి. వరంగల్ మెట్రో ప్రాజెక్టు కోసం 184 కోట్లు కేటాయింపు కూడా ఉంది. హైదరాబాద్ అర్బన్ సముదాయంలో రవాణా నెట్ వర్క్‌ను మెరుగుపరచడానికి రాష్ట్రం ఆసక్తిగా ఉంది.
ఏపీ:
తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. గతంలో కూడా ఏపీ ఇదే విషయంపై ఫైట్ చేసింది. అయితే కేంద్ర బడ్జెట్ 2022 ఈ అంశాలపై చర్చిస్తుందా? లేదా? అన్ని ఇప్పుడు పెద్ద ప్రశ్న. సిరి సిటీ, పారిశ్రామిక సముదాయం టౌన్‌షిప్ ప్రమోటర్, బెంగళూరు చెన్నై వంటి మెట్రోలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక లాభాలను నిర్ధారించడానికి మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలని ఏపీ డిమాండ్ చేసింది. పీఏహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ ఆంధ్రాలోని విశాఖపట్నం జిల్లాలోని పాండురంగాపురం నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు రైలు కనెక్టివిటీని ఏపీ కోరింది.
కర్ణాటక:
కేంద్ర బడ్జెట్ 2022లో కర్ణాటక కూడా చాలా డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే.. రైలు కనెక్టివిటీని పెంచడం, కొత్త ఓడరేవును అభివృద్ధి చేయడం, కొత్త పెద్ద విమానాశ్రయం కోసం కేటాయింపులు ఉన్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఒకవైపు, కీలకమైన దక్షిణాది రాష్ట్రాలు మరోవైపు ఉన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోందన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Also Read: Union Budget Key Points: కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి..? బడ్జెట్‌లో కీలకమైన పది అంశాలేంటి..??
Also Read: Budget 2022: అతి వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook