కరోనావైరస్ మోర్టాలిటీ రేటు ( Mortality rate ) తక్కువగా ఉండటంతో పాటు రికవరీ రేటు కూడా 75% వరకు ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 దశలో ( Unlock 4.0 guidelines ) మెట్రో రైలు, లోకల్ రైళ్ల సేవలు ప్రారంభమవుతాయనే వార్తల నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. అదేమంటే.. కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మెట్రో రైలు సేవలు ( Metro rail services ), లోకల్ రైళ్లు ( Local trains ), మల్టీప్లెక్సులు, సినిమా హాల్స్ ( Theatres ) లాంటివి ఏవీ వద్దని జనమే చాలా స్పష్టంగా చెబుతున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. Also read : Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోకల్ సర్కిల్స్ ( Local circles ) అనే సంస్థ సోషల్ మీడియా ద్వారా జరిపిన అధ్యయనంలో 25,000 మందిని ప్రశ్నించగా.. అందులో 51 శాతం మంది ప్రస్తుతానికి మెట్రో రైలు, లోకల్ రైలు సేవలు వద్దనే చెబుతున్నట్టు స్పష్టమైంది. కేవలం 36 శాతం మంది మాత్రమే పై సేవలు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తేలగా.. మిగతావారి పరిస్థితి ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. Also read : Bigg Boss 4: జబర్ధస్త్ ఫేమ్ ఆర్టిస్టులకు ఆ ఒక్క ఛాన్స్ ?


ఇక మల్టీప్లెక్సులు ( Multiplexes ), సినిమా హాల్స్ విషయానికొస్తే.. 77 శాతం మంది వీటికి స్పష్టంగా నో చెబుతున్నారు. వీటిలో ఉండే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టం వల్ల కరోనావైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని ఇంకొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. Also read : Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్


అదే క్రమంలో ఒకవేళ సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభిస్తే.. మీరు మీ పిల్లలను పాఠశాలకు పంపిస్తారా అని అడగ్గా.. 62 శాతం మంది తమ పిల్లలను బడికి పంపించమనే చెప్పారు. మరో 23 శాతం మంది మాత్రమే తమ పిల్లలను స్కూలుకి పంపిస్తామని తెలిపారు. Also read : Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం?