COVID-19 positive test reports: న్యూ ఢిల్లీ: కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... ''కరోనా లక్షణాలతో బాధపడే వారికి కొవిడ్ ఆస్పత్రుల్లో చేరాలంటే కరోనా పరీక్షలకు సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు'' అని స్పష్టంచేసింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో చాలా చోట్ల కరోనా పరీక్షలు ఆలస్యమవుతుండం లేదా కరోనా పరీక్షల నివేదికలు ఆలస్యంగా వస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా చికిత్స కోసం కొవిడ్ ఆస్పత్రుల్లో చేరాలనుకునే కరోనా పేషెంట్స్‌ ఇక కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ కోసం వేచిచూడాల్సిన పని లేదని కేంద్రం తేల్చిచెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : దేశవ్యాప్తంగా Lockdown విధించండి: కేంద్రానికి IMA లేఖ


దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) విజృంభిస్తున్న తరుణంలో స్థానికులు, స్థానికేతరులు అనే సమస్యలకు తావు లేకుండా కరోనా పేషెంట్స్‌ని ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని, అందుకు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు అని కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు ఆధార్ కార్డు (Aadhaar card) ఆధారంగా స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి కరోనా పరీక్షలు, వైద్య సహాయం అందిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe