/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Aadhaar Authentication History: దేశంలో ఇప్పుడు ప్రతి చిన్న పనికీ ఆధార్ కార్డే ఆధారమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మరీ తప్పనిసరిగా మారింది. దేనికైనా అదే ఆధారమైన నేపధ్యంలో ఆధార్‌ను ఎన్నిసార్లు ఎప్పుడు ఎలా వాడారో తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం

మొబైల్ సిమ్ తీసుకోవాలన్నా...బ్యాంకు ఖాతా తెరవాలన్నా సరే, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది పొందాలన్నా సరే. అన్నింటికీ ఒకటే ఆధారం. అదే ఆధార్ కార్డు. చాలాసార్లు మీరెక్కడో ఇచ్చిన ఆదార్ కార్డు (Aadhaar card)మరెక్కడో మిస్ యూజ్ కూడా అయ్యే పరిస్థితి ఉంది. ఆధార్ జిరాక్స్‌పై మీరు సంతకం చేసి ఎక్కడో సమర్పిస్తారు. అది కాస్తా చేతులు మారి మరెక్కడో ఉపయోగపడుతుంటుంది. అందుకే మీరు గత ఆరు నెలల్లో మీ ఆధార్ కార్డును ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారనేది తెలుసుకోవచ్చు. ఆ సదుపాయాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది.

అయితే ఇది తెలుసుకోవాలంటే మీ ఆధార్ కార్డును ప్రతి ఒక్కరూ తమ మొబైల్ నెంబర్‌కు లింక్ చేసుకుని ఉండాలి. ముందుగా ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ( Aadhaar authentication history)పేజ్ ఓపెన్ చేయాలి. అందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి..అక్కడ కన్పించే సెక్యూరిటీ కోడ్ టైప్ చేయాలి. తరువాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే..మీ మొబైల్ నెంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. ఆ తరువాత అక్కడ మీకు కన్పించే పేజీలో ఎన్ని లావాదేవీలు చూడాలనుకుంటున్నారు..ఎంత వ్యవధిలోవి చూడాలనుకుంటున్నారు వంటి వివరాల్ని నమోదు చేయాలి. ఆ తరువాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. వెంటనే తేదీ , సమయం, ఆధార్ కార్డు అథెంటికేషన్ వివరాలు స్క్రీన్ పై కన్పిస్తాయి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇది తెలుసుకోవడం వల్ల మన ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించారనేది తెలిసిపోతుంది. మన ఆధార్ కార్డును మనం కాకుండా ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తున్నారా అనేది తెలుస్తుంది. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఈ వివరాలు తెలుసుకోవాలంటే మీ మైబైల్ నెంబర్ తప్పనిసరిగా రిజిస్టర్ కావల్సి ఉంటుంది. 

Also read: Funny Memes On Petrol Price: పెరుగుతున్న ఇంధన ధరలపై ఫన్నీ జోక్స్, వైరల్ అవుతున్న Funny Jokes On Fuel Price

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
How to check your aadhaar card authentication history, here is the process and benefits
News Source: 
Home Title: 

Aadhaar Authentication History: మీ ఆధార్ కార్డు ఎప్పుడు ఎలా..లేదా వేరెవరైనా వాడారో

Aadhaar Authentication History: మీ ఆధార్ కార్డు ఎప్పుడు ఎలా..లేదా వేరెవరైనా వాడారో లేదో ఇలా తెలుసుకోవచ్చు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఆధార్ కార్డును ఎవరు ఎప్పుడు..లేదా మీరు ఎన్నిసార్లు వాడారో ఇలా తెలుసుకోవచ్చు

ఆధార్ కార్డు అథెంటికేషన్ హిస్టరీతో ప్రయోజనాలివే

మీ మొబైన్ నెంబర్ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉంటే చాలు

Mobile Title: 
Aadhaar Authentication History: మీ ఆధార్ కార్డు ఎప్పుడు ఎలా..లేదా వేరెవరైనా వాడారో
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, March 1, 2021 - 17:15
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
95
Is Breaking News: 
No