India Covid-19 Cases Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా మంది జేఎన్‌.1 వేరియంట్‌ బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 358 మందికి వైరస్ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది. ఈ కేసుల్లో 21 జేఎన్‌.1 వేరియంట్‌కు సంబంధించినవి. వైరస్ తో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. అయితే రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు రేటు 1.18 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్‌.1కు సంబంధించిన కేసులు అధికంగా కేరళలో నమోదవుతున్నాయి.  కొత్త కేసుల్లో 300 ఆ రాష్ట్రంలోనే ఉండటం కలవరానికి గురిచేస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం రాష్ట్ర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ కట్టడి, ఆస్పుత్రుల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మూడు నెలలకొకసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని మంత్రి సూచించారు. 


తెలంగాణలో ఆరు కేసులు


తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆరు కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. 538 మందికి కొవిడ్ టెస్టులు చేస్తే.. ఆరుగురికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో కొవిడ్ బాధితుల సంఖ్య 14కు చేరగా.. ఒకరు రికవరీ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా నమోదైన ఆరు కేసులు హైదారాబాద్ కు చెందినవే. దీంతో మంత్రులు, అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న క్రమంలో సన్నద్ధంగా ఉండాలని తెలంగాణ వైద్యారాగ్య శాఖ మంత్రి సిబ్బందిని ఆదేశించారు లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని మంత్రి సూచించారు. 


Also Read: New Swarnima Scheme: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. 5 శాతం వడ్డీకే లోన్లు.. ఇలా అప్లై చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook