New Swarnima Scheme: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. 5 శాతం వడ్డీకే లోన్లు.. ఇలా అప్లై చేసుకోండి

New Swarnima Scheme For Women 2023: తక్కువ వడ్డీకే కేంద్ర ప్రభుత్వం లోన్లు అందజేస్తోంది. కేవలం 5 శాతం వడ్డీకే రుణాలు అందజేస్తూ.. మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హులు ఎవరు..? పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2023, 04:57 PM IST
New Swarnima Scheme: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. 5 శాతం వడ్డీకే లోన్లు.. ఇలా అప్లై చేసుకోండి

New Swarnima Scheme For Women 2023: మహిళల సంక్షేమం కోసం స్వర్ణిమ పథకాన్ని ప్రవేశపెట్టింది నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NBCFDC). ఈ స్కీమ్ కింద వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా వ్యాపార యజమానులు, రైతులు, వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం టర్మ్ లోన్లు అందజేయనుంది. నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీ (SCA) ఈ స్కీమ్‌ను పర్యవేక్షిస్తోంది. ఈ పథకం కింద లభించే రుణంతో మహిళలు సొంతంగా వ్యాపారం ప్రారంభించవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే వ్యాపారం చేస్తున్నట్లయితే మరింత విస్తరించేందుకు ఈ లోన్‌ డబ్బులు వాడుకోవచ్చు. మహిళల కోసం తీసుకువచ్చిన కొత్త స్వర్ణిమ పథకం పూర్తి వివరాలు మీ కోసం.. 

కొత్త స్వర్ణిమ లోన్ స్కీమ్ టర్మ్ లోన్ పథకం. ఈ స్కీమ్‌ను NBCFDC ప్రారంభించింది. వెనుకబడిన తరగతుల మహిళలు తమ సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి ఉద్దేశించింది ఈ స్కీమ్. ఇందుకోసం వారికి లోన్‌ రూపంలో ఆర్థికంగా అండగా నిలబడతారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న వెనుకబడిన తరగతుల మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్టంగా రూ.2 లక్షల వరకు లోన్‌ను అందజేస్తాయి. ఈ రుణంపై ఏడాదికి 5 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుంది. నెలవారీగా లోన్‌ను లెక్కిస్తే.. కేవలం 42 పైసలు మాత్రమే వడ్డీ ఉంటుంది.

లోన్‌ కోసం అవసరమైన డాక్యుమెంట్స్..

==> ఆధార్ కార్డ్
==> పాన్ కార్డ్
==> ఓటర్ ఐడీ కార్డ్
==> ఆదాయ ధృవీకరణ పత్రం
==> నివాస ధృవీకరణ పత్రం
==> వృత్తి ధృవీకరణ పత్రం

అర్హతలు ఇవే..

==> దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
==> వయస్సు 18 నుంచి 55 మధ్య ఉండాలి.
==> అభ్యర్థి తప్పనిసరిగా యజమాని అయి ఉండాలి.
==> కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలలోపు ఉండాలి.
 
ఇలా దరఖాస్తు చేసుకోండి

కొత్త స్వర్ణిమ లోన్ స్కీ దరఖాస్తు చేయడానికి NBCFDC వెబ్‌సైట్ అధికారిక www.nbcfdc.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సమీపంలో మీ దగ్గర ఉన్న NBCFDC కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లోన్‌ను ఈఎంఐ రూపంలో ప్రతి మూడు నెలలకు చెల్లించాలి. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18001023399 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ

Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News