Covid-19 Updates: షాకింగ్ న్యూస్.. 1000 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా ప్రజల్లో భయాందోళలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను పాలించే నాయకులు సహా రక్షణగా ఉండే పోలీసులూ కొవిడ్ బారిన పడడం మరింత కలవరానికి గురిచేస్తుంది. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వీరూ కరోనా బారిన పడడం వల్ల వైరస్ ఎంత మేర వ్యాప్తి చెందిందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల్లో 1000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
Covid-19 Updates: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో అనేక మంది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సహా అనేక మంది ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
అయితే సాధారణంగా ప్రజలకు కరోనా వస్తే వారి కాంట్రాక్ట్ ట్రేస్ చేయడం పెద్ద కష్టమైన పని. కానీ, నిత్యం ప్రజల మధ్య సంచరించే పోలీసులు కొవిడ్ బారిన పడితే..! అలాంటి పోలీసులను కనిపెట్టడం చాలా పెద్ద కష్టమే. అలా వారి నుంచి ఎంత మంది పౌరులకు, నాయకులు వైరస్ సోకే ప్రమాదముందో తెలుసుకోవాలంటే కష్టంగా మారింది.
ఇప్పుడు 1000 మందికి పైగా పోలీసులకు కరోనా సోకడం వల్ల ఢిల్లీ పోలీసుల్లో కలవరం మొదలైంది. అటు ప్రజలతో పాటు నాయకులకు కరోనా భయం పట్టుకుంది. ఢిల్లీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో), అడిషనల్ కమిషనర్ చిన్మోయ్ బిశ్వాల్ వంటి వారు కూడా కరోనా వైరస్ సోకిన వారి జాబితాలో ఉన్నారు. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సహా అనేక యూనిట్లలోని పోలీస్ స్టేషన్లలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది కరోనా బారినట్లు తెలుస్తోంది.
"పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో), ఎడిషనల్ కమిషనర్ చిన్మోయ్ బిశ్వాల్ తో సహా 1000 మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బందికి చేసిన కరోనా పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది" ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ లో వెల్లడించారు.
ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 20,751 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 2021 మే 5 తర్వాత ఒక్క రోజులో అంతటి కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీనితో, పాజిటివిటీ రేటు 23.53 శాతానికి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 17 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ రాష్ట్ర హెల్త్ బులెటిన్ ప్రకారం.. 35714 మంది రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: India Corona Cases Today: ఇండియాలో మరోసారి లక్షన్నర దాటిన కరోనా కేసులు- 146 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook