Covid 19 Vaccination in India: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. నేటితో (జూలై 17) దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 200 కోట్ల మార్క్‌ను దాటింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన 18 నెలల్లో భారత్ ఈ మార్క్‌ను చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘనత సాధించినందుకు దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. వ్యాక్సినేషన్ డోసుల పంపిణీలో 200 కోట్ల మార్క్‌ను దాటింది. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంత వేగంగా, అసమాన రీతిలో సాగడానికి సహకరించినవారి పట్ల గర్వంగా ఉంది. కోవిడ్ మహమ్మారిపై గ్లోబల్ ఫైట్‌ను ఇది మరింత బలోపేతం చేసింది.' అని నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్‌ను షేర్ చేసి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తన ట్వీట్‌లో మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారత్ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. భారత్‌లో 200 కోట్ల వ్యాక్సిన్ల చరిత్రలో నిలిచిపోతుందన్నారు.


కాగా, భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి జనవరి 2, 2021న కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 21, 2021 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కోటి వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి చేసుకుంది. మార్చి 21న కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చింది. 277 రోజుల్లో (9 నెలల్లో) దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసింది. గతేడాది సెప్టెంబర్ 17న ఒకేరోజులో అత్యధికంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసింది. అక్టోబర్ 21న 150 కోట్ల మార్క్‌ను దాటింది. తాజాగా 200 కోట్ల మార్క్‌ను దాటి ప్రపంచంలో అత్యంత వేగంగా అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ నిర్వహించిన దేశంగా రెండో స్థానంలో నిలిచింది. 



Also Read: Bonalu Live Updates: అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు... బంగారు బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత  


Also Read: Cloud Busrt: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా? గోదావరిపై కుట్ర జరిగిందా?


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.