COVID-19 vaccine: తిరువనంతపురం: కరోనావైరస్ వ్యాక్సిన్‌‌ను కేరళ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan ) ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ (Cronavirus vaccine) కోసం ఎలాంటి చార్జీలు విధించమని, అందరికీ అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. శనివారం ఆయన కన్నూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అంతకుముందు మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నట్లు ప్రకటించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కరోనావైరస్ వ్యాక్సిన్‌ ( COVID-19 vaccine ) ను కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి కేటాయిస్తుందని సీఎం విజయన్ తెలిపారు. దాని పరిమాణం గురించి ఇంకా స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ ( Coronavirus ) కేసుల సంఖ్య తగ్గుతోందని, ఇది తమకు ఉపశమనం కలిగించే విషయమని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశలు ముగిసినప్పటికీ.. కేసుల పెరుగుదలకు ఈ ఎన్నికలు దోహదం చేస్తాయో లేదో రాబోయే రోజుల్లో మాత్రమే తెలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. Also read: Covid19 vaccine: ఇండియాలో జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందా..


ఇదిలాఉంటే.. కేరళ ( Kerala ) లో శనివారం కొత్తగా 5,949 కరోనా ( Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 32 మంది ఈ మహమ్మారితో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6.64 లక్షలకు చేరగా.. ప్రస్తుతం 60,029 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 2,594 కు చేరుకుంది. Also read: Hyderabad: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook