Children Vaccination: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా రేపట్నించి మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. దేశంలో రేపట్నించి చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా చిన్నారుల కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పటి వరకూ 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇప్పుడు తొలిసారిగా రేపట్నించి టీనేజ్ వయస్సువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా 15-18 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో రేపు ప్రారంభం కానుంది. జనవరి 1వ తేదీ నుంచి అంటే శనివారం నుంచి ఇప్పటికే కోవిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్‌లో (Cowin) ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని స్లాట్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తరువాత వ్యాక్సినేషన్ ప్రాంతంలో కూడా వెరిఫై చేయించుకోవల్సి ఉంటుంది. తొలిడోసు, రెండవ డోసుకు మద్య 28 రోజుల గ్యాప్ ఇస్తున్నారు. 15-18 ఏళ్ల వయస్సువారికి రోజుకు 3 లక్షల చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వగల సామర్ధ్యం ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అటు కేరళలో చిన్నారుల వ్యాక్సినేషన్ (Covid Vaccination for Children) కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.


గత ఏడాది అంటే 2021 డిసెంబర్ 25న చిన్నారుల వ్యాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అటు ముఖ్యమైన కేటగరీ వ్యక్తులకు మూడవ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కోవాగ్జిన్ ఇవ్వనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 2007లో లేదా అంతకంటే ముందు పుట్టిన వారంతా వ్యాక్సినేషన్‌కు అర్హులు. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సులో చిన్నారులు పది కోట్ల మంది ఉండవచ్చని తెలుస్తోంది. ఒమిక్రాన్ (Omicron) సంక్రమణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. 


ఓ వైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న అంటే శనివారం 22 వేల కేసులు నమోదు కాగా..తాజాగా 24 గంటల వ్యవధిలో 27 వేల 553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Variant)కేసుల సంఖ్య 1525కు చేరుకుంది. 


Also read: COVID19 Guidelines: కొవిడ్ రూల్స్​ పాటించని వారిపై చర్యలు- ఒక్క రోజే రూ.కోటి ఫైన్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook