Covid Vaccination:కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టించిన భారత్, ప్రపంచంలోనే అత్యధికంగా టీకాల పంపిణీ
కొవిడ్ వ్యాక్సినేషన్‌లో మనదేశం రికార్డు సృష్టించింది. చాలా మంది కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నారు భారత్‌లో. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఈ సంఖ్య ప్రపంచంలోనే మన దేశంలోనే అత్యధికంగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కొన్ని వివరాలు వెల్లడించింది. భారత్‌లో సెప్టెంబరు వరకు పురుషులకు 52.5శాతం, మహిళలకు 47.5శాతం, ఇతరులకు 0.02శాతం డోసుల వ్యాక్సిన్ (vaccine) వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ బాగా జరిగింది. 62.54శాతం వ్యాక్సినేషన్ జరిగింది.
India has inoculated highest number in Covid-19 vaccine in the world: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో మనదేశం రికార్డు సృష్టించింది. చాలా మంది కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నారు భారత్‌లో. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఈ సంఖ్య ప్రపంచంలోనే మన దేశంలోనే అత్యధికంగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కొన్ని వివరాలు వెల్లడించింది. భారత్‌లో సెప్టెంబరు వరకు పురుషులకు 52.5శాతం, మహిళలకు 47.5శాతం, ఇతరులకు 0.02శాతం డోసుల వ్యాక్సిన్ (vaccine) వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ బాగా జరిగింది. 62.54శాతం వ్యాక్సినేషన్ జరిగింది.
వయోజనుల్లో 60.7శాతం మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 2,44,310 టీకా కేంద్రాలు పని చేస్తున్నాయి. 18.1 కోట్ల మందికి రెండుడోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లంతా వందశాతం తొలి డోసు తీసుకున్నారు. ఇక 81.1 శాతం మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
Also Read : CPI Narayana Shocking Comments: బిగ్‌బాస్ ఓ 'బ్రోతల్ హౌస్', 'రెడ్‌లైట్ సంస్కృతి'
72.77 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు
ఆరోగ్య సిబ్బందిలో 98.8శాతం మంది తొలి డోసు తీసుకున్నారు. 84.7శాతం మంది రెండో డోసు వ్యాక్సిన్ (second dose vaccine) కూడా వేయించుకున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇంతవరకు 72.77 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు ఉచితంగా అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న భారీ ఎత్తున కొవిడ్ వ్యాక్సినేషన్ (vaccination) చేపట్టనుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆ రోజు 32.90 లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : Lavanya Tripathi Beauty Tips: లావణ్య త్రిపాఠి చర్మ రహస్యం అదే, అందాన్ని అలా కాపాడుకుంటుందట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook