Lavanya Tripathi skin care secrets: అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనాతో పాటు పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ సొట్టబుగ్గల సుందరి. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అంత బ్యూటీఫుల్‌గా ఉండడానికి రోజూ కొన్ని టిప్స్ పాటిస్తుంది. ఈ అమ్మడు తన చర్మ సంరక్షణకు (skin care) సహజపద్ధతులనే ( Natural tips) పాటిస్తుంది.
ఈ చిట్కా బాగా పని చేస్తుందట
రోజూ సెనగ పిండిలో కాస్త పెరుగు, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్, స్పోర్ట్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ వాలు కళ్ల వయ్యారికి ఈ చిట్కా బాగా పని చేస్తుందట. ట్యాన్‌ను (tan) దూరం చేయడంతో పాటు తన ముఖానికి మెరుపును ఇస్తుందని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.
Also Read : Aid to Afghan: ఆఫ్ఘనిస్తాన్‌కు భారీగా ఆర్ధిక సహాయం అందించనున్న ప్రపంచ దేశాలు
అవన్నీ ముఖానికి రుద్దేసుకుంటుందట
అలాగే నిమ్మరసంలో బేకింగ్ సోడా కలుపుకుని ఫేస్‌కు అప్లై చేసుకుంటుందట లావణ్య. ఈ చిట్కా కూడా తనకు బాగా వర్క్ అవుట్ అయ్యిందని చెప్తోంది ఈ అమ్మడు. వంట చేయడం తనకు ఇష్టమైన వ్యాపకం అంది ఈమె. ఆ సమయంలో కోసే టొమాటో, నిమ్మకాయ, (Lemon) దోస వంటి వాటిని కూడా ముఖానికి రుద్దేసుకుంటుందట. వీటి ద్వారా అందే సహజ పోషకాలు ఇంకెలాంటి ప్రొడక్ట్‌ల ద్వారా అందవు అని చెప్పింది లావణ్య.
అందాన్ని అలా కాపాడుకుంటుంది
బియ్యపు పిండిలో చిటికెడు దాల్చినచెక్క పొడి, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటుందట త్రిపాఠి. దీంతో ముఖానికి నునుపుతో పాటు స్వచ్ఛమైన గులాబీ మెరుపు వస్తుందంటోంది లావణ్య. ఇక రోజూ ఓట్‌మీల్, (oatmeal)నారింజ తొక్కల పొడి మిశ్రమాన్ని.. స్క్రబ్‌గా ఉపయోగిస్తా అని చెప్పకొచ్చింది లావణ్య త్రిపాఠి. ఇలాంటి సహజ పద్ధతులను రోజూ ఉపయోగించడం వల్లే తన అందాన్ని కాపాడుకోగలుగుతున్నాను అంటోంది లావణ్య త్రిపాఠి. మరి ఇలాంటి బ్యూటీ టిప్స్ (Beauty Tips) పాటిస్తే.. మన అందాన్ని కూడా కాపాడుకోవచ్చన్నమాట.
Also Read : Supreme Court: ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook