ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండోదశ ప్రారంభమై..తీవ్ర ప్రభావం చూపుతోంది.  ఇండియాలో సైతం కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా సెకండ్ వే ( Corona second wave ) ప్రారంభమైంది.. ఇండియాలో ఇప్పటికే బాధితుల సంఖ్య 90 లక్షల 50 వేలు దాటింది. రికవరీ రేటు కూడా ఆశాజనకంగా 93 శాతముంది. అయితే కరోనా వైరస్ ( Corona virus ) మరోసారి పంజా  విసిరితే తట్టుకోవడం కష్టసాధ్యమని వైద్య నిపుణులు హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్ వంటి ప్రధాన నగరాల్లో కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమయ్యాయి.  ఏ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నారనే వివరాలు.. Also read: Tamilnadu: గడువుకు ముందే శశికళ విడుదల సాధ్యం కాదా


ఢిల్లీలో..


కరోనా ధర్డ్ వేవ్ ( Corona third wave ) ప్రారంభమైన నేపధ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కోవిడ్ 19 నిబంధనల్ని కఠినం చేసింది. మాస్క్ ధరించకపోతే 2 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. పెళ్లి వంటి శుభకార్యాలకు కేవలం 50 మందికేఅనుమతించింది. మార్కెట్లు తెర్చుకునేందుకు అనుమతిచ్చినా...పూర్తిగా నిఘా ఉంటుందని తెలిపింది. నిబంధనలు  ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 


ముంబైలో…


దేశ ఆర్థిక రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబరు 31 వరకు పాఠశాలు మూసివేయాలని బృహణ్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదేశాలు జారీ చేసింది.  అటు లోకల్‌ రైళ్ల ప్రయాణాలు అప్పుడే ప్రారంభం కావని ముంబై మేయర్ స్పష్టం చేశారు. ముంబై మినహా మిగతా ప్రాంతాల్లో నవంబరు 23 నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని ఠాక్రే సర్కారు ఆదేశించింది.


గుజరాత్ లో..


గుజరాత్‌ ముఖ్యపట్టణం అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల్నించి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించారు. కేవలం నిత్యావసరాల షాపులు తెరిచేందుకు మాత్రమే అనుమతిచ్చారు. రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదరలోనూ నైట్‌ కర్ఫ్యూ విధించారు.


మధ్యప్రదేశ్ లో..


ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియర్‌, రత్లాం, విదిశలో నవంబరు 21 నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయి. అయితే కంటెన్మైంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్‌ విధించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. మరోవైపు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలపై నిషేధం విధించనున్నట్టు చెప్పారు. 


రాజస్తాన్ లో..


రాష్ట్రంలో నవంబరు 21 నుంచి అన్ని జిల్లాల్లోనూ సెక్షన్‌ 144 విధిస్తూ రాజస్తాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టినట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తెలిపారు. Also read; Terror Attack: 26/11..మరో ఉగ్రదాడికి ప్రయత్నం