India: 15 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Positive cases In India) 15 లక్షలు దాటింది. మంగళవారం నాడు ఇప్పటివరకు మరణాలలో ఒకరోజులో అత్యధిక కోవిడ్19 మరణాలు సంభవించాయి.
భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 49,292 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించగా, ఏకంగా 781 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య (CoronaVirus Positive Cases in India) 15,32,449కి చేరింది. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి రికార్డులు
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,206కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా కేసులలో భారత్ మూడో స్థానంలో ఉండగా.. 44.3 కరోనా కేసులతో అమెరికా, 24.4 పాజిటివ్ కేసులతో బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్, బీసీసీఐ దారెటు?
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,77,43,740 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 4,08,855 శాంపిల్స్ మంగళవారం టెస్ట్ చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు