ముంబైలో మరణ మృదంగం మ్రోగించిన కరోనా..
మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, సోమవారం నాడు ముంబైలో కరోనాతో 20 మంది మృతి చెందారని, కొత్తగా 791 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, సోమవారం నాడు ముంబైలో కరోనాతో 20 మంది మృతి చెందారని, కొత్తగా 791 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14355కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 3110 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారని, 528మంది కరోనా బారిన పడి మృతి చెందారని అన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 1230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 36 మంది మృతి చెందగా, మొత్తం పాజిటివ్ 23,401 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.
మరోవైపు తెలంగాణాలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. 11వ తేదీన నమోదైన కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనీవేనని, దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,275కు చేరిందన్నారు. ఈ వైరస్ నుండి కోలుకుని సోమవారం రోజు 50 మంది డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం 444 యాక్టివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 801 అని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..