Covishield vs Covaxin: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ రెండు వ్యాక్సిన్‌లను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏ వ్యాక్సిన్ మంచిదనే సందేహాలు ఎక్కువయ్యాయి. మరోవైపు గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లు ప్రధాన భూమిక వహిస్తున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్( Serum Institute) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ది చేసిన కోవ్యాగ్జిన్‌లు. అయితే రెండింటిలో ఏ వ్యాక్సిన్ మంచిదనే సందేహాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా విన్పిస్తున్నాయి. తొలుత కోవిషీల్డ్ మంచిదనే వాదన వచ్చింది. ఇప్పుడు కోవ్యాగ్జిన్ మంచిదంటున్నారు. ఏది నిజం..ఏ వ్యాక్సిన్ మంచిది.


వాస్తవానికి ఇండియాలో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్ లు మంచివేనంటున్నారు వైద్య నిపుణులు. కోవిషీల్డ్ (Covishield) లైవ్ వైరస్‌పై అభివృద్ధి చేస్తే..కోవ్యాగ్జిన్ (Covaxin) డెడ్ లీ వైరస్‌పై అభివృద్ధి చేసింది. కోవిషీల్డ్‌పై అమెరికా, యూకే, ఇండియాలో మూడు ట్రయల్స్ జరిగాయి. అన్నింటిలోనూ 80-85 శాతం సామర్ధ్యమున్నట్టు నివేదిక వెలువడింది. ఇక కోవ్యాగ్జిన్‌‌కు 80 శాతం సామర్ధ్యమున్నట్టు తేలింది. ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి. వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం విదేశీ వ్యాక్సిన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కోవిషీల్డ్ లేదా కోవ్యాగ్జిన్ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోమనే వైద్యులు చెబుతున్నారు. 


గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా


గర్ణిణీ స్త్రీలు (Pregnant women) వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే విషయంపై చాలా సందేహాలు వస్తున్నాయి. గర్భిణీ స్థ్రీలపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇంకా శాస్త్రీయ ఆధారాలు వెల్లడి కాలేదు. అందుకే గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదనేది వైద్యుల అభిప్రాయం. ఇక పీరియడ్స్‌లో ఉన్న మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. సాధారణ రుతుక్రమం సమయం ( Periods time) లో మహిళలు వ్యాక్సిన్ తీసుకుంటే ఇబ్బంది లేదంటున్నారు వైద్య నిపుణులు. రుతుక్రమానికి వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయితే రక్తస్రావం ఎక్కువగా జరిగినప్పుడు గానీ, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు గానీ వ్యాక్సిన్ (Vaccine) తీసుకోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండి సమస్యలు వచ్చే ప్రమాదముంది.


Also read: Delhi Lockdown: ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు, ఇవాళ కేజ్రీవాల్ తుది నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook