Punjab: పంజాబ్‌  కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్‌ సింగ్‌పై నలుగురు మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన  వాగ్దానాలను సీఎం నిలబెట్టుకోలేకపోయారనీ, ఆయనపై తమకు నమ్మకం పోయిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి తృప్తి రాజీందర్ సింగ్ బజ్వా నివాసంలో వీరంతా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి నివేదిస్తామని బజ్వా తెలిపారు. పూర్తిస్థాయి ప్రక్షాళన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఉంటే అది వెంటనే చేయాలని అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు.


Also Read:Maharashtra: ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు, కేంద్రమంత్రి అరెస్టు


ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు దిల్లీకి బయల్దేరినట్లు సమాచారం. కాగా ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook