Maharashtra: ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు, కేంద్రమంత్రి అరెస్టు

Maharashtra: మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగాధం మరింతగా పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి వివాదం చిలికి చిలికి గాలివానగా మారి..మంత్రి అరెస్టుకు దారితీసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2021, 04:09 PM IST
Maharashtra: ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు, కేంద్రమంత్రి అరెస్టు

Maharashtra: మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగాధం మరింతగా పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి వివాదం చిలికి చిలికి గాలివానగా మారి..మంత్రి అరెస్టుకు దారితీసింది. 

మహారాష్ట్రలో(Maharashtra)కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం పెరిగి పెద్దదవుతోంది. కేంద్రమంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. రాయ్‌గఢ్ జిల్లాలో జరిగిన జన్ ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి నారాయణ్ రాణే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray)ను కొట్టాలనేంత కోపమొచ్చిందంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటని..ఎన్నవ స్వాతంత్య్రదినోత్సవమో పక్కనున్న వ్యక్తిని అడిగి తెలుసుకున్నారని మంత్రి చెప్పారు. ఒకవేళ తాను అక్కడుంటే థాక్రేను కొట్టేవాడినన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. రాణే వ్యాఖ్యలతో శివసేన, బీజేపీ(BJP) మధ్య యుద్ధం మొదలైంది. ఒకరికొకరు రాళ్లు రువ్వుకున్నారు. 

ఈ వ్యాఖ్యలపై శివసేన (Shiv sena)పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయం గ్రహించిన రాణే రత్నగిరి గోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్ రద్దు కావడంతో రంగంలో దిగిన పోలీసులు కేంద్రమంత్రి నారాయణ రాణే(Narayana Rane)ను అరెస్టు చేశారు. ఈ వ్యాఖ్యల్ని పోలీసులు చాలా తీవ్రమైన అంశంగా పరిగణించారు. 

Also read: Anantapuram to Amaravati: శాసన రాజధాని అమరావతి నుంచి అనంతపురంకు నాలుగు లైన్ల రహదారికి ఆమోదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News