Pizza cyber crime: దేశంలో రోజురోజుకూ సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. తాజాగా పిజ్జా, డ్రైఫ్రూట్లను ఆన్​లైన్​లో ఆర్డర్ చేసిన మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధురాలికి (senior citizen) కేటుగాళ్లు టోకరా వేశారు. ఆమె ఖాతాలోని రూ.11 లక్షలను హాంఫట్ చేశారు. బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో..ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే..


ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ (Mumbai woman).. గతేడాది జులైలో పిజ్జా ఆర్డర్ (Pizza order) చేశారు. డెలివరీకి ఆన్​లైన్ పేమెంట్ చేసే క్రమంలో రూ.9,999 పోగోట్టుకుంది. అక్టోబర్ 29న డ్రైఫ్రూట్స్​ను ఆర్డర్ చేస్తూ ఆన్​లైన్ లావాదేవీలో రూ.1,496ను కోల్పోయింది. సదరు మహిళ కోల్పోయిన డబ్బును రికవరీ చేయడం కోసం గూగుల్​లో లభించిన ఓ ఫోన్ నెంబర్​ను సంప్రదించింది. 


Also Read: Kerala Lottery 12 Crore: గంటల వ్యవధిలోనే రూ.12 కోట్లు సంపాదించిన పెయింటర్.. ఎలానో తెలుసా?


అది సైబర్ కేటుగాళ్లుకు వరమైంది. ఆమెతో అటు నుంచి మాట్లాడిన సైబర్ నేరగాళ్లు.. డబ్బులు రికవరీ చేయాలంటే ఫోన్​లో ఓ యాప్​ను డౌన్​లోడ్ చేయాలంటూ మభ్యపెట్టారు. తెలీక యాప్​ను డౌన్​లోడ్ చేసిన ఆ మహిళ.. వారి వలలో చిక్కుకుపోయింది. యాప్ ద్వారా ఫోన్ లోని సమాచారాన్ని వారు తస్కరించారు. మహిళ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.11.78 లక్షల డబ్బును తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు. 2021 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook