Cyclone Dana: సైక్లోన్ దానా.. లోతట్టు ప్రాంతాలు ఖాళీ.. రైళ్లు సైతం రద్దు..!
Cyclone Dana effect: వర్షాకాలం మొదలైతే చాలు తుఫాన్ల ప్రభావం.. తీవ్రత పెరుగుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. రోజు రోజుకి బాధపడుతూ.. ఈరోజు సాయంత్రం నుంచి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Trains canceled due to Cyclone Dana: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజురోజుకీ బలపడుతూ ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని.. దీని ప్రభావం ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పై పడే అవకాశం ఉందని సమాచారం.
Cyclone Dana
ఇకపోతే ఈ తుఫాన్ కి దానా అని నామకరణం చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అధికారులు వాయుగుండం.. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే బంగాళా తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
దీనికి తోడు అక్టోబర్ 25న తెల్లవారుజామున 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు తీరం దాటే అవకాశం ఉందని , ఈ నేపథ్యంలోనే ఒడిస్సా ప్రభుత్వం అటు ప్రజలను ఇటు విద్యార్థులను సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒడిస్సా రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 3వేల గ్రామాల నుండి దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా రాబోయే తుఫాను వల్ల రాష్ట్ర జనాభాలో సగం మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అటు దానా తుఫానును ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలిపారు. ఈ దానా తుఫాను కారణంగా అనేక రైళ్ళు రద్దు చేయడంతో రైలు రాకపోకలపై కూడా ప్రభావం పడింది. తిరునల్వేలి జంక్షన్ నుండి రైల్ నెంబర్ 06087 అక్టోబర్ 24న తిరునల్వేలి నుండి.. బయలుదేరాల్సిన షాలిమార్ స్పెషల్ రైలు రద్దు చేయబడింది.
భువనేశ్వర్ నుండి రామేశ్వరం వెళ్లే రైలు అక్టోబర్ 25న భువనేశ్వర్ నుండి బయలుదేరాల్సిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేయబడింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒడిశా నుండి వెళ్లే 198 రైళ్లను.. రద్దు చేయడం జరిగింది. అంతేకాదు బెంగాల్ మరియు ఒడిస్సాలో కూడా పాఠశాలలు మూసి వేయబడుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter