ముంబై: Cyclone Nisarga live updates నిసర్గ తుఫాన్ తీరాన్ని తాకింది. వాతావరణ శాఖ ( (IMD ) అంచనా వేసినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 2.30 గంటల వరకు కొనసాగింది. అలీబాగ్‌కి సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకడంతో ( Alibaug ) దాని ప్రభావం ముంబైపై కొంత వరకు తగ్గడానికి ఓ కారణమైందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో అరేబియా సముద్రం ( Arabia sea ) అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలజడితో తీర ప్రాంతాల్లో పలు చోట్ల అలలు 15-20 అడుగుల ఎత్తువరకు ఎగిసిపడుతున్నాయి. నిసర్గ తుఫాను తాకిడికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. మహారాష్ట్రలో తుఫాన్ ప్రభావం అధికంగా కనిపించింది. ముంబై సహా రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ( Heavy rains in Mumbai ). ప్రస్తుతం గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దక్షిణ గుజరాత్‌లోనూ తుఫాన్ ప్రభావం అధికంగానే ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గుజరాత్‌లోని ద్వారక పుణ్యక్షేత్రం వద్ద తుఫాన్ తాకిడికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ( Cyclone Nisarga live updates: దూసుకొస్తున్న నిసర్గ తుఫాన్... 3 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం )



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

  రత్నగిరి వద్ద ఎసిగిసపడుతున్న అలలు... అల్లకల్లోలంగా మారిన సముద్రం.



ముంబైని ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్.



నిసర్గ తుపాను సాయంత్రానికి కొంత బలహీనపడి, మధ్యరాత్రికి మరింత బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్ర తెలిపారు.


కరోనావైరస్ వ్యాప్తితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైపైనా నిసర్గ తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగర జనజీవనం అస్తవ్యస్తమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక ఆంక్షల మధ్య జీవనం సాగిస్తున్న ముంబై వాసులను నిసర్గ తుఫాన్ సైతం ఇక్కట్ల పాలుచేసింది.


నిసర్గ తుఫాను నేప‌థ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూడామన్‌లోనూ కేంద్రం భారీ సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించింది. ఇప్పటికే తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ నష్టం తీవ్రతను తగ్గించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో 16 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను మోహ‌రించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..