రష్యాకు చెందిన స్పూత్నిక్ వీ కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19) కు రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్ కు భారత దేశంలో అనుమతి లభించింది. మనుషులపై జరిగే ఈ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( Drug Controller General Of India ) డాక్టర్ రెడ్డీస్ ఫార్మాసూటికల్ సంస్థకు పర్మీషన్  ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


READ ALSO | Budgam Terrorist Video: నీకేం కాదు, బయటికి రా! ఉగ్రవాదితో సైన్యం ఎలా వ్యవహరించిందో చూడండి


సెప్టెంబర్ 16న రష్యాకు చెందిన రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ( RDIF), డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ ఒక ఒప్పందానికి వచ్చాయి. భారత దేశంలో స్పూత్నిక్ వీ ( Sputnik V ) కోవిడ్ -19 వ్యాక్సిన్ మానవదశ ప్రయోగాలు, ఇతర క్లినికల్ ట్రయల్, పంపిణి అంశాలపై ఈ రెండు సంస్థలు ఒక ఒప్పందం చేసుకున్నాయి.


రష్యాలో తయారు అయిన స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ ఆగస్ట్ 11న రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ రిజిస్టర్ చేసుకుంది. డాక్టర్ రెడ్డీస్ ( Dr. Reddys ) సహ వ్యవస్థాపకులు జీవి ప్రసాద్ దీని గురించి మాట్లాడుతూ..భారత్ లో మానవదశ ప్రయోగాలకు అనుమతి లభించడం అనేది అద్భుతమైన పరిణామం. కరోనావైరస్ ( Coronavirus ) మహహ్మారిని తరిమికొట్టే సురక్షితమైన వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నాం అని తెలిపారు.



READ ALSO | Good News: ప్రైవేట్ ఉద్యోగులుకు మోదీ ప్రభుత్వం శుభవార్త!


ఈ ఒప్పందం ప్రకారం RDIF సంస్థ నుంచి డాక్టర్ రెడ్డీస్ సంస్థ 100 మిలియన్ల ( పదికోట్లు ) వ్యాక్సిన్ డోసులను పొందనుంది. మానవదశ ప్రయోగాలలో సురక్షితం అని నిర్ధారణ జరిగిన స్పూత్నిక్ వి వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్ లో ఉంది అని రష్యాకు చెందిన RDIF సంస్థ తెలిపింది. 2020 చివరి నాటికి వ్యాక్సిన్ పంపిణిని మొదలు పెట్టనున్నారని సంస్థ తెలిపింది. అయితే దీని కోసం ముందు భారత దేశంలో అన్ని దశలను ఈ వ్యాక్సిన్ పూర్తి చేయాల్సి ఉంటుంది రష్యన్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తెలిపింది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR