Virafin medicine: కరోనా చికిత్సలో మరో కొత్త మందుకు డీసీజీఐ అత్యవసర అనుమతి
Virafin medicine: కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ కరోనా చికిత్సకు మరో ప్రత్యామ్నాయ మందు అందుబాటులో వచ్చింది. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
Virafin medicine: కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ కరోనా చికిత్సకు మరో ప్రత్యామ్నాయ మందు అందుబాటులో వచ్చింది. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) దేశవ్యాప్తంగా ఉప్పెనలా విరుచుకుపడుతోంది. దేశంలో భారీగా పెరుగుతున్న కేసులతో ఆక్సిజన్, బెడ్స్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ( Remdesivir Injections) కొరత తీవ్రమైంది. ముఖ్యంగా ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 3.5 లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా చికిత్సలో ప్రధానంగా ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో ఈ మందు లభ్యం కావడం లేదు. ఈ నేపధ్యంలో కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కొత్త మందు మార్కెట్లో అందుబాటులో వచ్చింది.
అదే విరాఫిన్( Virafin Medicine). అంటే పెగిలేటెడ్ ఇంటర్ ఫెరాన్ ఆల్ఫా-2 బి. జైడస్ క్యాడిలా ప్రవేశపెట్టిన మందు ఇది. కరోనా ఇన్‌ఫెక్షన్ మద్య స్థాయిలో ఉన్నవారికి అందించేందుకు జైడస్ క్యాడిలా( Zydus Cadila) ప్రవేశపెట్టిన ఈ మందు అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతిచ్చింది. విరాఫిన్ మందుపై జైడస్ క్యాడిలా కంపెనీ దేశవ్యాప్తంగా 20-25 ప్రాంతాల్లో మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించింది. ప్రయోగ వివరాల్ని కూడా కంపెనీ బయటపెట్టింది. ఈ డ్రగ్ తీసుకున్నవారిలో వైరస్ లోడ్ తగ్గడంతో పాటు ఆక్సిజన్ తీసుకునే అవరం కూడా తగ్గిందని తేలింది. విరాఫిన్ డ్రగ్ తీసుకున్న ఏడురోజుల్లో 91.15 శాతం కరోనా రోగులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఒక్క డోసుతోనే అద్భుత ఫలితాలు వచ్చినట్టు పేర్కొంది.
అయితే విరాఫిన్ డ్రగ్‌తో ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు ఈ డ్రగ్ అందుబాటులో ఉండనుంది. ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇదే మందును హెపటైటిస్ సి ( Hepatitis C) వ్యాధికి వినియోగిస్తున్నారు. 2004లో సార్స్ (SARS) వ్యాధి వచ్చినప్పుడు తొలిసారి విరాఫిన్ పేరు విన్పించింది. అప్పట్లో కూడా ఇదే డ్రగ్ వాడారు. ఇప్పుడు కరోనా చికిత్సలో వినియోగానికి డీసీజీఐ అనుమతిచ్చింది.
Also read: Weekend Curfew: కర్నాటకలో కఠినమైన ఆంక్షలు, ఇక నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook