Hike in Gas Cylinder Price: దీపావళి పండుగకు సాధారణంగా.. కేంద్ర ప్రభుత్వాలు శుభవార్త చెబుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు దీపావళి పండుగ వచ్చిందంటే గ్యాస్ ధరలు సాధ్యమైనంత వరకు తగ్గుతూ ఉంటాయి. అయితే ఈసారి ఊహించని విధంగా  గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇది కాస్త సామాన్యులకు భారంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే హోటళ్లకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర పై సుమారుగా 62 రూపాయల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ధరలు ఈరోజు నుంచి అమలు అయ్యే విధంగా గ్యాస్ సంస్థలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ధరలు ఒక నెల మాత్రమే కొనసాగుతాయి మళ్లీ వచ్చే నెల ఒకటో తారీకు ఈ ధరలు మారే అవకాశం ఉంది. 
అయితే ఈ మధ్యకాలంలో మూడు నెలలలోనే సిలిండర్ ధరలు అమాంతం పెరగడంతో ఈ భారం సామాన్యులపై పడిందని చెప్పవచ్చు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. 



అసలే కూరగాయల ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి గ్యాస్ ధరలు పెరగడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 62 రూపాయలు పెంచడంతో.. ఒక్కో సిలిండర్ ధ1802 రూపాయలకు చేరింది.  ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో..ఇలా  ధరలు పెరగడం ఒక్కసారిగా సామాన్యుడి నెత్తిన భారీ భారం పడిందని కూడా చెప్పవచ్చు.


దేశంలోని పలు నగరాలలో గ్యాస్ ధరల విషయానికి వస్తే..


1). ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1740 నుంచి రూ.1, 802 కి చేరింది. 


2). కోల్కత్తాలో రూ.1850 నుంచి రూ.1,911 కి చేరినది. ప్రస్తుతం అయితే బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలలో మాత్రం ఎలాంటి మార్పులు లేవన్నట్లుగా తెలుస్తోంది. డొమెస్టికల్ సిలిండర్ల విషయంలో కూడా ఎలాంటి మార్పులు లేవట.  ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున గ్యాస్ సిలిండర్.. ధరలను సైతం ఆయిల్ కంపెనీ సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇలాంటి తరుణంలోనే  ఈరోజు సరికొత్త ధరలను ప్రకటించాయి.


 


Also Read: Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.