LBSNAA COVID-19: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలిబ్రిటీల దాకా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా ముస్సోరీలోని (Mussoorie) లాల్ బ‌హ‌దూర్‌శాస్త్రీ నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మ‌నిష్ట్రేష‌న్‌లో (Lal Bahadur Shastri National Academy of Administration) క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు 84 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విష‌యాన్ని నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్ ధృవీకరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 క‌రోనా సోకిన 84 మంది ట్రైనీ ఐఏఎస్ (IAS trainees) అధికారుల‌ను స‌ప‌రేట్‌గా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) మనోజ్ ఉప్రేతి తెలిపారు. ఐఏఎస్ అనుబంధ స‌ర్వీసుల‌తో క‌లిపి 480 మంది శిక్ష‌ణా ఐఏఎస్ బృందం గుజ‌రాత్ నుంచి డెహ్ర‌డూన్‌కు చేరుకుంది. వారికి డెహ్ర‌డూన్‌ రైల్వేస్టేష‌న్‌లో (Dehradun Railway Station) అధికారుల‌కు ఆర్టీపీసీఆర్‌, పీసీఆర్ టెస్టులు నిర్వ‌హించారు. ఈ టెస్టుల్లో 84 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.


Also Read: Fine for not wearing mask: మాస్కులు ధరించలేదని వేసిన జరిమాన అక్షరాల 86 కోట్ల రూపాయలు


దేశంలో 3 లక్షలకుపైగా కేసులు
 దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు.. 3,17,523 కేసులు (Corona Cases in india) నమోదయ్యాయి. వైరస్​తో మరో 491 మంది మరణించారు. 2,23,990 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉంది.  మరోవైపు,  దేశంలో ఒమిక్రాన్​ కేసులు (Omicron Cases in India) క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook