India Covid Cases Today: దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు- పెరిగిన మరణాలు

India Covid Cases Today: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అనగా 3,17,532 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. కొవిడ్ ధాటికి 491 మంది మరణించారు. మరోవైపు 2,23,990 కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో 9,287 కు చేరింది.       

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 09:39 AM IST
    • దేశంలో భారీ స్థాయిలో పెరిగిన కరోనా ఉద్ధృతి
    • ఒక్కరోజే మూడు లక్షలకు పైగా నమోదు, 491 మరణాలు
    • 9,287కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
India Covid Cases Today: దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు- పెరిగిన మరణాలు

India Covid Cases Today: ఇండియా కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,17,532 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే 3.63 శాతం ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా ధాటికి దేశంలో మరో 491 మంది మరణించారు. 

మరోవైపు 2,23,990 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287 కు చేరింది. 

దేశంలో కరోనా వ్యాప్తి

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,82,18,773 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,87,719 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 19,24,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,58,07,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

వ్యాక్సినేషన్ ప్రక్రియ

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 76,35,229 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,58,88,47,554 కు చేరింది.

ప్రపంచంలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 34,63,738 మందికి వైరస్​ సోకింది. 8,832 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 33,92,06,194 నమోదవ్వగా.. కరోనా మరణాలు 55,83,295కు చేరాయి. 

Also Read: Uttarakhand Elections 2022: బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్​ సోదరుడు

Also Read: Fine for not wearing mask: మాస్కులు ధరించలేదని వేసిన జరిమాన అక్షరాల 86 కోట్ల రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News