Delhi Acid Attack: ఢిల్లీ యాసిడ్ దాడిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు, ఆన్‌లైన్‌లో యాసిడ్ కొనుగోలు చేసిన నిందితుడు
Delhi Acid Attack: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు జారీ అయ్యాయి. యాసిడ్ దాడికి..ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా..
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున పట్టపగలు 17 ఏళ్ల బాలికపై అత్యంత అమానుషంగా జరిగిన యాసిడ్ దాడి కలకలం సృష్టించింది. ఈ యాసిడ్ దాడి కేసులో ఇవాళ కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
ఢిల్లీ ద్వారకానగర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగిన రెండవరోజు ఢిల్లీ కమీషన్ ఫర్ విమెన్ రెండు ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసులు జారీ చేసింది. యాసిడ్ దాడి కేసులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులేంటని ఆశ్చర్యపోవద్దు. నిందితులు వినియోగించిన యాసిడ్ ఫ్లిప్‌కార్డ్ నుంచి కొనుగోలు చేయడం, అదే యాసిడ్ అమెజాన్‌లో కూడా లభిస్తుండటం దీనికి కారణం. ఎందుకంటే యాసిడ్ ఇలా బహిరంగంగా అమ్మడం అక్రమమే.
డిసెంబర్ 14వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు నిందితుడు..స్కూల్‌కు వెళ్తున్న 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి చేశాడు. నడుచుకుని వెళ్తున్న బాలిక ముఖంపై బై పై వస్తూ..యాసిడ్ పోయడం సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయింది. నిందితులు ఉపయోగించింది నైట్రిక్ యాసిడ్ కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 20 ఏళ్ల సచిన్ అరోరాతో పాటు ఇద్దరు సహచరులు 19 ఏళ్ల హర్షిత్ అగర్వాల్, 22 ఏళ్ల వీరేందర్ సింగ్ ఉన్నారు.
యాసిడ్ దాడి ప్లాన్ చేసింది ఎవరు
ఈ దాడి ప్లాన్ చేసింది సచిన్ అరోరా. ఈ దాడిలో 19 ఏళ్ల హర్షిత్ అగర్వాల్, 22 ఏళ్ల వీరేందర్ సింగ్ సహకరించారు. ముగ్గురూ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. నిందితులు యాసిడ్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ఈ వ్యాలెట్ ద్వారా సచిన్ అరోరా పేమెంట్ చేశాడు. నిందితుడు సచిన్ అరోరాకు బాధితురాలు చాలాకాలం స్నేహంగా ఉన్నారు. ఆ తరువాత ఇద్దరికీ బ్రేకప్ కావడంతో ఆ బాలిక మాట్లాడటం మానేసింది. ఇందుకు ప్రతీకారంగా సచిన్ అరోరా యాసిడ్ దాడి ప్లాన్ చేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు
యాసిడ్ అమ్మడం అక్రమమని తెలిసినా ఎందుకు అందుబాటులో ఉంచారో వివరణ కోరుతూ ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌లకు డీసీడబ్ల్యూ నోటీసు పంపించింది. నిందితుడు ఆర్డర్ చేసిన యాసిడ్‌కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కోరింది. ఆన్‌లైన్‌లో యాసిడ్ అమ్మకానికి పెట్టేముందు సెల్లర్ లైసెన్స్ తనిఖీ చేశారా లేదా అని ఢిల్లీ కమీషన్ ఫర్ విమెన్ కోరింది. ఇలా 9 అంశాలకు సంబంధించి వివరణ కోరుతూ నోటీసులు పంపించింది.
Also read: Acid Attacks: యాసిడ్ దాడి జరిగినప్పుడు తక్షణం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook