Arvind Kejriwal: జైలు నుంచే పాలన.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన తాజా ఆదేశాలివే..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Delhi CM Arvind Kejriwal Issues First Direction To Minister Atishi Over Water scarcity: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ, నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఇప్పటికే ఎన్నికల కోడ్ దేశ వ్యాప్తంగా అమల్లోకి కూడా వచ్చేసింది. ఈక్రమంలో.. అన్నిపార్టీలు ఎన్నికల ప్రచారం స్పీడును పెంచాయి. ఎన్నికలలో గెలిచి, సత్తాచాటాలని ప్రజల్లోకి వెళ్లున్నాయి. ఇక మరోవైపు ఇదేక్రమంలో ఈడీ కూడా తన దర్యాప్తు స్పీడును పెంచింది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం, అటూ వెనువెంటనే ఢిల్లీకి తరగించడం ఆగమేఘాల మీది జరిగిపోయింది. ఇక మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం ఇదే కేసులో ఈడీ అరెస్టు చేసింది.
Read More: Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వైరల్ గా మారిన వీడియో..
ఢిల్లీలో అవినీతి, నల్లధనం నిర్మూలన అనే నినాదాలతో ఆమ్ఆద్మీపార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ నాయకుడు ఈరోజు లిక్కర్ స్కాలో అరెస్టు కావడం దేశంలో తీవ్ర సంచలనంగా మారింది. బీజేపీకావాలనే, అపోసిషన్ లీడర్లపై నిరాధార ఆరోపణలతో,అణచివేసే కుట్రలకు తేరలేపిందని కూడా మండిపడుతున్నాయి. ఈడీ, దర్యాప్తు సంస్థలను కావాలనే ఉసిగొల్పి ఇలాంటి పనులు చేస్తుందంటూ కూడా అపోసిషన్ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో తదుపరి సీఎంగా ఎవరుంటారనే చర్చకూడా జరిగింది.
ఇదిలా ఉండగా..రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇక కేజ్రీవాల్ జైలునుంచి పాలన చేయడం అంత సులభం కాదని న్యాయనిపుణులు భావిస్తున్నారు. మీటింగ్ లు జరపడం, ఉన్నతస్థాయి సమావేశాలు, ఫైళ్లను చూడటం అంత ఈజీకాదని న్యాయనిపుణులు చెప్తున్నారు. అధికారులు జైలుకు వెళ్లిన ప్రతిసారి కోర్టు అనుమతి తీసుకొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Read More: Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ సీఎం జైలు నుంచి పరిపాలన ప్రారంభించారు. ఢ్డిలీ మంత్రి అతిషీకి ప్రస్తుతం మంచి నీటి సరఫరా సమస్యలపై ఆయన లేఖ రాశారు. " ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు నీటి సరఫరా, మురుగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చిందని, దీనిపై ఆందోళన చెందుతున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను జైలులో ఉన్నందున.. ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకూడదు. సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేయండి. అవసరమైతే.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సహాయంకూడా కోరండని లేఖలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook