Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేష్ బొమ్మలు.. కేంద్రానికి సీఎం కేజ్రీవాల్ రిక్వెస్ట్
Lakshmi-Ganesh Photos on Currency Notes: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత కరెన్సీ నోట్స్‌పై లక్ష్మీ, గణేష్ ఫొటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు.
Lakshmi-Ganesh Photos on Currency Notes: దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు మన కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోతో పాటు లక్ష్మీ, గణేష్ చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక బలోపేతానికి.. శ్రేయస్సు కోసం దేవుళ్ల ఆశీస్సులు కూడా అవసరమని అన్నారు. ఇండోనేషియా జనాభాలో దాదాపు 85 శాతం మంది ముస్లింలు, కేవలం 2 శాతం హిందువులు మాత్రమే ఉన్నా.. అక్కడ కరెన్సీపై వినాయకుడి బొమ్మ ఉందని గుర్తు చేశారు. ఇండోనేషియా ఇలా చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ-గణేష్ పూజ చేస్తున్నప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేష్ ఫొటోలు ఉంటే బాగుంటుందని అనిపించిందన్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని తాను అనడం లేదని.. దేవుడి ఆశీస్సులు లభిస్తాయని అన్నారు.
'మేము ఎవరి ఫొటోలను తొలగించడం గురించి మాట్లాడటం లేదు. భారత కరెన్సీపై ఒకవైపు మహాత్మాగాంధీ ఫొటో.. మరోవైపు లక్ష్మీ-గణేష్ బొమ్మలను ఉంచాలి. అన్ని నోట్లను మార్చాలని నేను కోరడం లేదు. ఇప్పటి నుంచి ముద్రించే కొత్త నోట్లన్నింటికీ లక్ష్మీ-గణేష్ ఫోటో ఉండాలి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిమాండ్ చేస్తా..' అని కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల కృషితో దేశ రాజధానిలో కాలుష్యం స్థాయి తగ్గిందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం తగ్గినా.. దానిపై తాము ఇంకా చాలా పనిచేయాల్సి ఉందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
Also Read: Wanaparthy Murder: కూతురి ప్రేమ వ్యవహారం.. దారుణంగా హత్య చేసిన తండ్రి
Also Read: Pawan Kalyan: పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే పొత్తుకు ఓకే! చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి