Delhi school board: దేశంలో ప్రతి రాష్ట్రానికో ప్రత్యేక విద్యాబోర్డులున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకు తప్ప. ఢిల్లీలో స్కూల్స్ అన్నీ సీబీఎస్ఈ బోర్డు పరిధిలోనే ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని నగరం ఢిల్లీ తప్ప అన్ని రాష్ట్రాలకు సొంతంగా విద్యాశాఖలున్నాయి. ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటుంది. ఆయా రాష్ట్రాల్లోని స్కూళ్లన్నీ ఆ బోర్డు పరిధిలో ఉండాలి. ఢిల్లీలో మాత్రం ఈ పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు ఢిల్లీలో ఇతర రాష్ట్రాలకున్నట్టే ప్రత్యేకమైన విద్యాబోర్డు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi cm arvind kejriwal). డిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏర్పాటును ఢిల్లీ కేబినెట్(Delhi cabinet) ఆమోదించింది. సీఈవో అధిపతిగా ఉండే ఈ బోర్డు రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి ఢిల్లీ విద్యామంత్రి నేతృత్వంలోని పాలక మండలి అయితే..మరొకటి రోజువారీ విధులు పర్యవేక్షించే కార్య నిర్వాహక సంస్థ ఒకటి. పాలక, కార్యనిర్వహక సంస్థల్లో విద్యారంగం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాల్స్  ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది. 


ఢిల్లీలో దాదాపు 25 స్కూళ్లు 2021-22 విద్యాసంవత్సరంలో బోర్టు పరిధిలో రానున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో మొత్తం వేయి వరకకూ ప్రభుత్వ పాఠశాలలు 17 వందల వరకూ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లన్నీ సీబీఎస్ఈకు అనుబంధంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్కూళ్లను సీబీఎస్ఈ బోర్డు నుంచి తొలగించి..ఢిల్లీ స్కూల్ బోర్డుకు అనుసంధానం చేయనున్నారు. 


Also read: CBSE class 10th and 12th exams 2021 date sheet revised: సీబీఎస్ఇ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook