దేశ రాజధానిలో చలి-పులి
దేశ రాజధాని ఢిల్లీలో చలి బెంబేలెత్తిస్తోంది. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో విపరీతంగా చలి పెరిగింది. రెండు రోజుల క్రితం 2.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో చలి బెంబేలెత్తిస్తోంది. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో విపరీతంగా చలి పెరిగింది. రెండు రోజుల క్రితం 2.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు 14 డిగ్రీల వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ రోజు ( సోమవారం ) గరిష్ట ఉష్ణోగ్రతలు 9. 4 డిగ్రీలుగా నమోదైంది. ఇది 119 ఏళ్ల రికార్డును అధిగమించిందని భారత వాతారణ శాఖ..IMD(India Meteorological Department) ప్రకటించింది.
[[{"fid":"180798","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
దడ పుట్టిస్తున్న చలి
ఢిల్లీలో వాతావరణం శీతలం నుంచి అతి శీతలానికి మారడంతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసరమైన పనులు ఉన్న వాళ్లు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉద్యోగాలకు వెళ్లేవారు, వ్యాపారాలు చేసుకునే వారు .. తీవ్రంగా పెరిగిన చలికి ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఈ వాతావరణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రంగా పెరిగిన చలి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని .. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..