ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. చలి చంపేస్తోంది. రికార్డుస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున రికార్డుస్థాయిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. నిన్న( శనివారం) తెల్లవారుజామున 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. చలి చంపేస్తోంది. రికార్డుస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున రికార్డుస్థాయిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. నిన్న( శనివారం) తెల్లవారుజామున 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం పూట బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసర పనులు ఉన్న వారు మాత్రమే బయటకు వస్తున్నారు. చలి గాలుల నుంచి తట్టుకునేందుకు స్వెట్టర్లు, తలపాగా చుట్టుకుని కనిపిస్తున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ చలి మంటలు కాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
'రెడ్' ప్రమాదక హెచ్చరిక జారీ
మరోవైపు ఢిల్లీలో రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ..IMD హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని ..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని తెలిపింది. 'రెడ్' ప్రమాదక హెచ్చరిక జారీ చేసింది. చల్లటి గాలులు పెరుగుతాయని తెలిపింది. కాబట్టి .. వృద్ధులు, మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఆసరాగా షెల్టర్ హోమ్స్
ఢిల్లీలో ఇళ్లు లేని వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అక్కడక్కడా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. నైట్ షెల్టర్ హోమ్స్ లో చాలా మంది పడుకుని ప్రాణాలు రక్షించుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..