Delhi Earthquake News Today: ఢిల్లీలో భూకంపం.. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన జనం
Delhi, NCR Earthquake Updates: ఢిల్లీలో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చే నొయిడా, గ్రేటర్ నొయిడా, గురుగ్రామ్ సహా ఢిల్లీని ఆనుకుని ఉన్న పలు ఇతర శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి భూమి కొన్ని క్షణాలపాటు కంపించింది.
Delhi, NCR Earthquake Updates: ఢిల్లీలో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చే నొయిడా, గ్రేటర్ నొయిడా, గురుగ్రామ్ సహా ఢిల్లీని ఆనుకుని ఉన్న పలు ఇతర శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి భూమి కొన్ని క్షణాలపాటు కంపించింది. భూమి కంపించడంతో భూకంపం భయంతో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మళ్లీ భూమి కంపిస్తుందేమో అనే భయంతో బహిరంగ ప్రదేశాల్లో నిలబడి బిక్కుబిక్కుమంటూ గడిపారు.
భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో 181 కిలో మీటర్ల లోతున ఉందని గుర్తించినట్లు భూకంప జాతీయ అధ్యయన కేంద్రం ప్రకటించింది. ట్విటర్ ద్వారా భూకంపాన్ని ధృవీకరించిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8 గా నమోదైంది అని వెల్లడించింది.
ఇది కూడా చదవండి : Sikhs Riots: సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్ నేత చుట్టూ ఉచ్చు, ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ
శనివారం రాత్రి సరిగ్గా 9.31 గంటలకు ఈ భూకంపం సంభవించినట్టు భూకంప జాతీయ అధ్యయన కేంద్రం ట్విటర్ లో పేర్కొంది. మరిన్ని వివరాల కోసం భూకంపం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ భూకంప్ యాప్ లో ఎప్పటికప్పుడు తాజా భూకంపం వివరాలు పొందుపర్చడంతో పాటు ఒకవేళ భూకంపం సంభవిస్తే జనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి : 2024 Elections Surveys: 2024 ఎన్నికల్లో ఈసారి అధికారం ఎవరిది, ఆ రెండు సర్వేలు ఏం చెబుతున్నాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి