Sikhs Riots: 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వేగం పెంచినట్టు కన్పిస్తోంది. ఆ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్ టైట్లర్‌పై హత్యానేరం మోపడమే కాకుండా ఆ మేరకు ఛార్జిషీటు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలోని చాలా ప్రాంతాల్లో సిక్కుల్ని లక్ష్యంగా చేసుకుని మారణకాండ సాగింది. వందలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఒక్కసారిగా కేసు వేగాన్ని పెంచింది. ఈ కేసులో నాటి కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌పై హత్యానేరం ఆరోపణలు సంధించి ఈ మేరకు తాజాగా ఛార్జిషీటు దాఖలు చేసింది. ఓ మహిళ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఈ అభియోగం నమోదు చేసినట్టు సీబీఐ తెలిపింది.
1984 నవంబర్ 1వ తేదీన కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ డిల్లీలోని గురుద్వార్ సమీపంలో ఉన్న పుల్ బంగాష్ వద్ద సిక్కుల్ని చంపమంటూ అల్లరి మూకల్ని రెచ్చగొట్టారనేది సీబీఐ మోపిన అభియోగం. తెల్లని అంబాసిడర్ కారులో అక్కడికి వచ్చిన జగదీష్ టైట్లర్ అల్లరి మూకల్ని రెచ్చగొట్టి సిక్కుల్ని చంపించడాన్ని తాను చూశానంటూ ఓ మహిళ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఈ కేసు నమోదైంది. సిక్కుల్ని చంపి దోపిడీ చేయమని జగదీష్ టైట్లర్ అల్లరి మూకల్ని రెచ్చగొట్టడం తాను చూశానని ఆ మహిళ చెప్పినట్టు సీబీఐ తాజా ఛార్జిషీటులో పేర్కొంది. ఈ మహిళతో పాటు మరి కొందరు కూడా సాక్ష్యమిచ్చినట్టు సీబీఐ తెలిపింది.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇన్నేళ్ల తరువాత హఠాత్తుగా మహిళ ఎక్కడ్నించి వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలో సిక్కుల ఊచకోత కేసును ఉపయోగించుకుంటున్నారని మండిపడుతోంది.
Also read: 2024 Elections Surveys: 2024 ఎన్నికల్లో ఈసారి అధికారం ఎవరిది, ఆ రెండు సర్వేలు ఏం చెబుతున్నాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook