Arvind kejriwal: ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్... మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Supreme court granted interim bai to delhi cm arvind kejriwal: ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసం ఈ బెయిల్ అభ్యర్థన పిటీషన్ ను విచారించింది. కాగా. ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈకేసులో ఇప్పటికే ఈడీలు, సీబీఐలు, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, పలువురు ఆప్ నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఎలాగైన బెయిల్ పై బైటకు తీసుకొచ్చేందుకు ఆప్ నేతలు నానా తంటాలు పడ్డారు. ఇప్పటికే ఆయనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని ఒక లా స్టూడెంట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఆ తర్వాత ఒక లాయర్ కూడా అర్వింద్ కేజ్రీవాల్ కు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కూడా పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉండగా.. మరల హైకోర్టులో పిటీషన్ వేయడమేంటని ప్రశ్నించింది. పిటిషనర్ లకు చివాట్లు పెట్టి, జరిమాన కూడా హైకోర్టు విధించింది.
ఇదిలా ఉండగా.. శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. జూన్ 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో.. మార్చి 21 న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఆప్ తరపున లాయర్లు.. కేజ్రీవాల్ కు జులై వరకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మాత్రమే అతనికి ఉపశమనం ఇచ్చింది. జూన్ 1న చివరి, ఏడవ దశ ఓటింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత జూన్ 2లోగా కేజ్రీవాల్ జైలు అధికారులకు లొంగిపోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూన్ 2 తర్వాత తన ఉపశమనాన్ని పొడిగించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనపై, వచ్చే వారం మళ్లీ విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. ఢిల్లీలోని ఏడు స్థానాలకు మే 25న జరగనున్న ఎన్నికలకు ముందే ఆయన విడుదలకు ముఖ్యమంత్రి న్యాయవాద బృందం గట్టి కసరత్తు చేసింది.
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ లో తీహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో ఆయన సన్నిహితుడు, ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కె కవిత ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఇదే కేసులో.. గత అక్టోబర్‌లో అరెస్టయిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌కు ఆరు నెలల వ్యవధి తర్వాత ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు.
Read more: Madhya Pradesh : ఎన్నికల వేళ తీవ్ర దుమారం..బాలుడితో ఓటువేయించిన బీజేపీనేత.. వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter