Delhi Unlock: దేశ రాజధాని ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ, లాక్‌డౌన్ ఆంక్షల తొలగింపు
Delhi Unlock: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా ఉధృతి తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ అంక్షల్ని తొలగిస్తున్నారు.
Delhi Unlock: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా ఉధృతి తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ అంక్షల్ని తొలగిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య చాలావరకూ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. లాక్‌డౌన్ ఆంక్షల్ని(Lockdown)తొలగించారు. ఉదయం 10 గంటల్నించి రాత్రి 8 గంటల వరకూ మార్కెట్లు, మాల్స్ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.హోటల్స్, బ్యాంకెట్ హాల్స్‌లో వివాహాలకు మాత్రం అనుమతి లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. 50 శాతం సామర్ధ్యంతో రెస్టారెంట్ల నిర్వహణకు అనుమతిచ్చామన్నారు.ఢిల్లీ మెట్రో, బస్సుల్లో 50 శాతం సామర్ధ్యంతో నిర్వహణకు అనుమతి ఇచ్చామన్నారు.
ఇక ఆటోలు, ఈ రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. స్పా, జిమ్, యోగా కేంద్రాలకు అప్పుడే అనుమతి లేదు. పార్క్, గార్డెన్లకు అనుమతి లేదు. ప్రార్ధనా మందిరాలు తెరిచినా..భక్తులకు అప్పుడే అనుమతివ్వలేదు. ఇళ్ల వద్ద కేవలం 20 మందితో వివాహాలకు అనుమతిచ్చామని అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejiwal) తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం గ్రూప్ ఏ సిబ్బందికి అనుమతిచ్చారు. ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతితో పాటు అత్యవసర కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు.
Also read: ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ జాబ్ నోటిఫికేషన్, గరిష్టంగా రూ.1 లక్ష వరకు జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook