Covid-19 vaccination: 18-44 వయస్సు వారికి వ్యాక్సిన్ నిలిపివేత
COVID-19 Vaccination for 18-44 age group:ఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఈ రోజు నుంచే వ్యాక్సిన్ పంపిణీ నిలిపేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించుకుంది.
COVID-19 Vaccination for 18-44 age group:ఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఈ రోజు నుంచే వ్యాక్సిన్ పంపిణీ నిలిపేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించుకుంది. 18-44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారి కోసం కేటాయించిన వ్యాక్సిన్స్‌ని ఇప్పటికే వినియోగించామని, మిగిలిన కొన్ని వ్యాక్సిన్లను ఈరోజు వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే వారికి పంపిణీ చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఏజ్ గ్రూప్ వారికి కేటాయించిన వ్యాక్సిన్ నిల్వలు ముగిసినందునే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఢిల్లీ సర్కారు స్పష్టంచేసింది.
Also read : Serum Institute: వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీరమ్ ఇనిస్టిట్యూట్ సంచలన వ్యాఖ్యలు
నేటి నుంచి 18 ఏళ్లకుపైబడిన వారికి వ్యాక్సినేషన్ నిలిపేసి మళ్లీ వ్యాక్సిన్లు అందిన తర్వాత తిరిగి యధావిధిగా ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు ఆయా వ్యాక్సినేషన్ సెంటర్స్ మూసే ఉంటాయని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
వ్యాక్సిన్ నిల్వలు ముగుస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన భారీ మొత్తంలో వ్యాక్సిన్లు తెప్పించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) అభిప్రాయపడ్డారు.
Also read : Sputnik V: ఆగస్టు నుంచి స్పుట్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తి ఇండియాలోనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook