Serum Institute: వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీరమ్ ఇనిస్టిట్యూట్ సంచలన వ్యాఖ్యలు

Serum Institute: కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిన నేపధ్యంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాదన నడుస్తోంది. ఇప్పుడు సీరమ్ ఇనిస్టిట్యూట్ సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2021, 11:18 AM IST
Serum Institute: వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీరమ్ ఇనిస్టిట్యూట్ సంచలన వ్యాఖ్యలు

Serum Institute: కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిన నేపధ్యంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాదన నడుస్తోంది. ఇప్పుడు సీరమ్ ఇనిస్టిట్యూట్ సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది.

దేశంలో కరోనా వైరస్ (Corona Virus) ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. కానీ రెండే రెండు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం, ఉత్పత్తి సామర్ధ్యం డిమాండ్ కంటే చాలా రెట్లు తక్కువుండటంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో రాష్ట్రాలకు కావల్సినంత వ్యాక్సిన్ సరఫరా కావడం లేదు. ఇప్పటికే ఈ విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రానికి వాదన నడుస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ వ్యాక్సిన్ తయారీదారు, కోవిషీల్డ్ (Covishield) ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ సంచలనం వ్యాఖ్యలు చేసింది.

ప్రజలకు వ్యాక్సిన్ అందించే విషయంలో ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించడం వల్లనే వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ ఆరోపించారు. హీల్ హెల్త్ సంస్థ నిర్వహించి సమ్మిట్‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం(Central government) ముందుగా..3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిందని..దాంతో అందుకు తగ్గట్టే ప్రభుత్వానికి 6 కోట్ల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేశామన్నారు. తరువాత వ్యాక్సిన్ కంపెనీను సంప్రదించకుండానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈడీ సురేశ్ జాదవ్ తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ (Covishield Vaccine) ఉత్పత్తి పరిమితమే అని తెలిసి కూడా 45 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల..ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌కు, వ్యాక్సిన్ తీసుకున్నవారికి మధ్య పొంతన లేకుండా పోయిందని వివరించారు. ఫలితంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడిందన్నారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యాక్సిన్ల కొరత గుణపాఠం లాంటిదన్నారు సురేశ్ జాదవ్. ఉత్పత్తి సామర్ధ్యం, నిల్వల ఆధారంగా వ్యాక్సినేషన్ చేయడమనేది సరైన పద్ధతన్నారు. దీనికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నియమాలు రూపొందించిందన్నారు. ఈ నియమాల్ని పాటించాలని సూచించారు.

Also read: India Covid Update: దేశంలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News