Delhi Jahangirpuri Violence: జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. సుప్రీం ఆదేశాలతో నిలిపివేత..!!
Delhi Jahangirpuri Violence: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. జహంగీర్‌పురిలో పలు ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలకు విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ పలు రకాల చర్యలు చేపట్టింది. ఈ చర్యల భాగంగానే అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభించింది.
Delhi Jahangirpuri Violence: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. జహంగీర్‌పురిలో పలు ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలకు విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ పలు రకాల చర్యలు చేపట్టింది. ఈ చర్యల భాగంగానే అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభించింది. వ్యతిరేకంగా ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం చర్యలు ప్రారంభించగా.. సుప్రీంకోర్టు కలగజేసుకుంది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకొని నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను వెంటనే ఆపేయాలని ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించిన తదుపరి విచారణ రేపు చేపడతామని వెల్లడించింది. ఓ వైపు స్థానిక యంత్రాంగం తీసుకు చర్యలకు విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
కూల్చివేతకు కారణాలు:
హనుమాన్ జయంతి వేడుకల్లో జహంగీర్‌పురిలోని పలు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తి ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే జహంగీర్‌పురి చెందిన కొందరు అల్లరిమూకలు అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న విధంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభించింది మున్సిపల్ కార్పొరేషన్. ఈ అంశంపై మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ స్పందిస్తూ..రోజూ వారీ కార్యకలాపాలల్లో భాగమేనని తెలిపారు. లేఖ రాసిన వెంటనే ఇలాంటి చర్యలు చేపట్టడంపై అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం కోర్టు కూల్చివేతపై స్పందించి కూల్చివేతన నిలిపివేయాలని ఆదేశించడంతో..నిలిపివేశామని మేయర్ రాజా ఇక్బాల్ తెలిపారు.
బుల్డోజర్లను ఇక ఆపేయండి: రాహుల్ గాంధీ
మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన డ్రైవ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశంపై ఆయన మండిపడ్డారు. వీలైనంత త్వరగా ఆక్రమ కట్టడాలను కూల్చేస్తున్న బుల్డోజర్లను ఆపివేయండని విమర్శిల వర్షం కురిపించాడు. ‘కేంద్రం ఎనిమిది సంవత్సరాల పాలన ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిందని, విద్యుత్ చార్జీలు చిన్న పరిశ్రమలను చిన్నభిన్నం చేస్తోందని, అందుకే బుల్డోజర్లను నిలిపివేసి, పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి’ అంటూ రాహుల్ తన ట్వీటర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. ఇదే అంశంపై పలు ప్రతిపక్ష పార్టీలు స్పందించి బీజేపీ పార్టీపై నిప్పులు చేరిగారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు.
Also Read: KL Rahul: లక్నో గెలుపు.. కేఎల్ రాహుల్‌కు రూ.12 లక్షలు జరిమానా!
Also Read: Shanghai Lockdown: సంచుల్లో పెంపుడు జంతువుల శవాలు.. రోడ్లపై కుప్పలు తెప్పలుగా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook