Delhi Liquor Case: లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..
Delhi Liquor Polity Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కల్వకుంట్ల కవితకు చెందిన లాయర్లు, సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.తాజాగా, విచారించిన కోర్టు సుప్రీంకోర్టు బెయిల్ కు నిరాకరించింది.
Delhi Liquor Scam Suprme Court Refuses Bail To Brs Leader k Kavitha: దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్లకుంట్ల అరెస్టు తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై దేశంలో అపోసిషన్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ ఈడీ, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందంటూ, నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు నిన్న (గురువారం) ఈడీ అధికారులు ఢిల్లీ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఒకవైపు లోకస్ సభ ఎన్నికల హీట్, మరోవైపు ఈడీ దూకుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంగా మారింది.
Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్టును సవాల్ చేస్తూ, అదేవిధంగా బెయిల్ ను ఇవ్వాలని కూడా కల్వకుంట్ల తరపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలుచేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సంజీవ్ ఖన్నా, బేలా ఎం. త్రివేది, సుందరేషన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్ కు నిరాకరించింది. దీనిలో ఈడీ అధికారులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం, ఆరు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని, దీనిపై విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేస్తూ ఆప్ తరపునేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీని విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. మధ్యాహ్నం కేజ్రీవాల్ పిటిషన్ ను విచారించనున్నట్లు సమాచారం.ఈడీ ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎన్నికల కోడ్, మరోవైపు ఈడీ దూకుడూ.. ఇక అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో తమదైన శైలీలో దూసుకుపోతున్నాయి. కవిత అరెస్టుపై కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకే ఎజెండాతో లోపయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter