Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం సంభవించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావల్సిందిగా కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకూ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, భారీగా డబ్బులు చేతులు మారడమే కాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టపోయిందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే ఇదే కసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ఈ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. 2023 ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పెటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలో కీలక పరిణామం జరిగింది. 


ఢిల్లీ మద్యం స్కాంలో  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇదే కేసులో ఇప్పటికే సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓసారి విచారించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఆప్ పార్టీని అంతమొందించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని ఆరోపించింది. ఈ నకిలీ కేసులో ఇరికించి అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం జైలుకు పంపేవరకూ వదిలిపెట్టేలా లేరని మండిపడ్డారు.


ఈ కేసులో 338కోట్లు చేతులు మారాయనే ఆరోపణకు సంబంధించి కొన్ని ఆధారాలను ఈడీ అందించినట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో కేవలం 6-8 నెలల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా దర్యాప్తు ఏజెన్సీలకు డెడ్‌లైన్ విధఘించింది. విచారణ మందకొడిగా జరిగితే మనీష్ సిసోడియా మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 


Also read: Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్‌లో జాబ్స్.. రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ జీతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook